అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ భారతీయుడా?

Update: 2020-11-14 08:32 GMT
అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడైన రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి జోబైడెన్ జనవరిలో బాధ్యతలు చేపట్టబోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ పరాజయం సంపూర్ణమైపోయిన వేళ ఇప్పుడు అమెరికన్ల ఆశలన్నీ జోబైడెన్ పైనే ఉన్నాయి. ఇప్పటికే అమెరికాకు ఉపాధ్యక్షురాలు కాబోతున్న కమలా హ్యారిస్ ప్రవాస భారతీయురాలే కావడం విశేషం. ఆమె తల్లి తమిళనాడులోనే పుట్టారు. తమిళనాట కమలా బంధువులు సంబరాలు కూడా చేసుకున్నారు.

ఈ క్రమంలోనే మరో ఆసక్తికర విషయం కూడా వెలుగుచూసింది. లండన్ లోని కింగ్స్ కాలేజీ విజిటింగ్ ప్రొఫెసర్ టిమ్ విలాసీ విస్లీ తాజాగా ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. జోబైడెన్ పూర్వీకులు సైతం భారత్ లోని చెన్నైలోనే ఉండేవారని టిమ్ చెప్పుకొచ్చారు.

2013లో జోబైడెన్ ముంబైలో పర్యటించారని.. తమ పూర్వీకులు ముంబైలో నివసించారని అప్పుడు ఆయన అన్నారు. 2015లో వాషింగ్టన్ డీసీలో బైడెన్ మాట్లాడుతూ.. ‘తన తాతయ్యకు తాతయ్య జార్జ్ బైడెన్ ఈస్ట్ ఇండియాలో కంపెనీలో కెప్టెన్ గా పనిచేసినట్లు చెప్పారు. 1972లో తనకు ముంబై నుంచి వచ్చిన ఓ ఉత్తరం ద్వారా ఈ విషయం తెలిసిందన్నారు.

బ్రిటీష్ వారి హయాంలో క్రిష్టోఫర్ బైడెన్ అనే వ్యక్తి చెన్నైలోనే ఉద్యోగం చేసేవారు.దాదాపు 19 ఏళ్ల పాటు ఉన్నారు. ఓడ ప్రయాణాలకు సలహాదారుడిగా పనిచేశారు. క్రిస్టోఫర్ చెన్నైలోనే 1858 ఫిబ్రవరి 25న మరణించారు. ఆయన సమాధి చెన్నైలోని సెయింట్ జార్జి క్యాథెడ్రల్ లో ఉంది. క్రిస్టోఫర్ మరణం తర్వాత ఆయన భార్య లండన్ కు వెళ్లిపోయారు. క్రిస్టోఫర్ బైడెన్ తదుపరి సంతానమే ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్ అని టిమ్ విలాసీ అభిప్రాయపడ్డారు.

తమ పూర్వీకులు ఈస్ట్ ఇండియా కంపెనీలో కెప్టెన్లుగా పనిచేసినట్లు జోబైడెన్ స్వయంగా చెప్పాడు. జోబైడెన్ చెప్పిన వివరాలకు క్రిస్టోఫర్ బైడెన్ లకు సరిపోతున్నాయని టిమ్ తెలిపారు. దీంతో జోబైడెన్ పూర్వీకులు భారత్ లో ఉండేవారి తెలిసింది.
Tags:    

Similar News