తొందరగా గమ్యస్థానానికి వెళ్లాలన్న తొందరలో కొందరు రైల్వే ఫ్లై ఓవర్లపై నుంచి కాకుండా రైల్వే ట్రాక్ లు దాటుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రైల్వే ట్రాక్ లపై నడవడం వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రయాణికులకు ఎంత అవగాహన కల్పించినా మార్పు రాకపోవడం.. ప్రాణాలు పోతుండడంతో ముంబై కేంద్రంగా నడుస్తున్న పశ్చిమ రైల్వే అధికారులు వినూత్న ప్రయోగం చేశారు.
హిందూ పురాణాల్లో యమ ధర్మరాజు మనుషులను ప్రాణాలు తీసుకుపోయే వ్యక్తిగా అందరికీ తెలిసిందే. అలాంటి యముడి వేషధారణ గల వ్యక్తులను రద్దీగల రైల్వే స్టేషన్ లో ఉంచి రైల్వే ట్రాక్ లు దాటే వారికి అవగాహన కల్పించడానికి పశ్చిమ రైల్వే సిద్ధం చేసింది. కొందరు యమ ధర్మరాజు వేషం వేసిన వ్యక్తులు ఇప్పుడు రైల్వే ట్రాక్ లు దాటుతున్న వారిని గమనించి వారిని భుజాలపై ఎత్తుకొని వచ్చి స్టేషన్ ఆవరణలో పడేస్తున్నారు. ఈ తరహా ప్రచారం వైరల్ గా మారింది.
తాజాగా యమ ధర్మరాజు వేషం వేసిన వ్యక్తి రైల్వే ట్రాక్ లపై నడుస్తున్న వారిని అమాంతం ఎత్తుకెళ్లి ఫ్లాట్ ఫాంపైకి తీసుకువస్తున్న ఫొటోలను పశ్చిమ రైల్వే ట్వీట్ చేసింది. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి.
యమ ధర్మరాజు ప్రాణాలను తీయడమే కాదు కాపాడుతాడు అని పశ్చిమ రైల్వే ఈ ఫొటోలు షేర్ చేసి రాసుకొచ్చింది. ట్రాక్ ల మీద ఇప్పటికైనా ప్రజలు నడిచి ప్రాణాలు పోవద్దనే ఇలా ప్రచారం చేస్తున్నామని.. అందరూ సబ్ వేలను వాడాలని రైల్వే కోరుతోంది.