దేశంలో ఇప్పుడు రెండు వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. మూడో వ్యాక్సిన్ అయిన రష్యాకు చెందిన స్పుత్నిక్ - వి వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి కేంద్రం ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. స్పుత్నిక్ కు ఓకే చెప్పిన నాటి నుంచి దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరగటమే కాదు.. బోలెడంత ఆసక్తి వ్యక్తమవుతోంది. ఎందుకిలా? స్పుత్నిక్ ప్రత్యేకతలు ఏమిటి? అదెలా పని చేస్తోంది? దాని సైడ్ ఎఫెక్టులు ఏమిటి? దాని ధర ఎంత ఉంటుంది? ఎన్ని డోసులు వేసుకోవాలి? ఏ రూపంలో ఉంటుంది? దీని నిల్వ మాటేమిటి? దీని ప్రభావం టీకా వేసుకున్న తర్వాత ఎంత కాలం ఉంటుంది? లాంటి చాలానే ప్రశ్నలు వస్తున్నాయి. ఇలాంటివేళ.. స్పుత్నిక్ టీకాకు సంబంధించిన ఆసక్తికర అంశాల్ని చూస్తే..
- గత ఏడాది ఆగస్టులోనే రష్యాలోని గమేలియా ఇన్ స్టిట్యూట్ ఈ వ్యాక్సిన్ ను తయారు చేసింది. మన దేశంలో హైదరాబాద్ కు చెందిన రెడ్డీస్ ల్యాబ్స్ ఫార్మా సంస్థ ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది.
- దేశీయంలో రెడ్డీస్ తో పాటు హెటెరో..పనాసీ.. బయోటెక్.. గ్లాండ్.. స్టెలిస్.. విర్కో ఫార్మా కంపెనీలు దీన్ని ఉత్పత్తి చేయనున్నాయి. ఏడాదికి 85 కోట్ల వ్యాక్సిన్లు తయారు చేయటం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 25 శాతం కంటే ఎక్కువే.. విదేశాలకు ఎగుమతి చేయనున్నారు.
- సాధారణంగా జలుబు చేసే రెండు రకాల అడెనో వైరస్ లను తీసుకొని.. వాటిని బలహీన పర్చి వాటికి కరోనా వైరస్ స్పైక్ లో ఉండే ప్రోటీన్ ను జోడించి తయారు చేశారు. దీంతో.. రోగ నిరోధక వ్యవస్థ మీద అతిగా స్పందించకుండా.. తగిన యాంటీబాడీస్ ను ఉత్పత్తి చేస్తాయి. దీన్ని వినియోగించిన వారికి సైడ్ ఎఫెక్ట్స్ అతి తక్కువగా ఉన్నట్లు చెబుతారు.
- ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు చెక్ పెట్టే చాలా టీకాలు అందుబాటులో ఉన్నా.. కొన్నింటి ప్రభావమే ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. అందులో మొదటి స్థానం ఫైజర్ వారి 95.3 శాతం పని చేస్తున్నట్లుగా లెక్క కట్టారు. తర్వాతి స్థానంలో మోడెర్నా 94.1 శాతం పని తీరు ఉందని తేల్చగా.. స్పుత్నిక్ 91.6శాతంగా నిర్దారించారు.
- స్పుత్నిక్ వ్యాక్సిన్ ను పొడి రూపంలోనూ సిద్ధం చేశారు. సాధారణ ఫ్రిజ్ లలో 2 నుంచి 8 డిగ్రీల సెంటీగ్రేటర్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయొచ్చు. దానికి డిస్టల్ వాటర్ కలిపి లిక్విడ్ ఇంజెక్షన్ గా మార్చితే మాత్రం మైనస్ 18డిగ్రీల వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత రెండు నుంచి మూడు గంటల వ్యవధిలో టీకాలు ఇవ్వాల్సి ఉంటుంది.
- ఈ వ్యాక్సిన్ ను ఇప్పటివరకు అరవై దేశాల్లో వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు దేశీయంగా స్పుత్నిక్ వ్యాక్సిన్ ను ఎంత ధరకు సరఫరా చేస్తారన్న దానిపై స్పష్టత రాలేదు. ఒక అంచనా ప్రకారం రూ.750 చొప్పున ధరను ఫిక్స్ చేసే వీలుందన్న మాట వినిపిస్తోంది.
- స్పుత్నిక్ ను రెండు డోసుల్లో వేసుకోవాల్సి ఉంటుంది. కాకుంటే.. మొదటి డోసులో ఒకరకం.. రెండో డోసులో రెండో రకం అడెనో వైరస్ తో తయారు చేసిన వ్యాక్సిన్ ఇవ్వటం దీని ప్రత్యేకత. దీని వల్ల రోగనిరోధక శక్తి రెండుసార్లు క్రియాశీలమవుతుంది. యాంటీబాడీస్ ఎక్కువ కాలం ఉంది.. శరీరానికి రక్షణ కల్పిస్తాయి.
- ఈ వ్యాక్సిన్ ను అర మిల్లీ లీటరు డోసు చొప్పున 21 రోజుల తేడాతో రెండుసార్లు వేసుకోవాల్సి ఉంటుంది. రెండో డోస్ వేసుకున్న తర్వాత శరీరంలో యాంటీ బాడీస్ ఉత్పత్తి బాగా పెరుగుతుంది. టీకా వేసుకున్న 28 రోజు నుంచి 42 రోజు మధ్యలో గరిష్ఠంగా రోగ నిరోధక శక్తి ఉంటుందని గుర్తించారు. టీకాతో తయారైన యాంటీబాడీస్.. ఎక్కువ కాలం శరీరంలో ఉండి.. కోవిడ్ నుంచి రక్షణ కల్పిస్తాయని చెబుతున్నారు.