వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సోదరుడు.. మాజీ ఎంపీగా.. మాజీ మంత్రి వైఎస్ వివేకా 2019 మార్చి 15న దారుణంగా హత్యకు గురి కావటం తెలిసిందే. పులివెందులలోని ఆయన ఇంట్లోనే ఆయన్ను దారుణంగా హత్య చేసిన వైనాన్ని తాజాగా ఆయన వద్ద కారు డ్రైవర్ గా పని చేసి మానేసిన దస్తగిరి వెల్లడించాడు. సీబీఐ నమోదు చేసిన ఈ వాంగ్మూలాన్ని తాజాగా కోర్టుకు ఇచ్చారు. ఈ వాంగ్మూలంలో దస్తగిరి కీలక విషయాల్ని పూస గుచ్చినట్లుగా చెప్పేశాడు.
హత్య జరిగిన రోజు ఏం జరిగింది? హత్య తర్వాత ఏమేం చేశారు? లాంటి విషయాల్ని కూడా వెల్లడించాడు. వివేకాను హత్య చేయాలని డిసైడ్ చేసి.. అందుకు తగ్గట్లు తెర వెనుక పనుల్ని పూర్తి చేసిన నిందితులు.. తాము అనుకున్నట్లుగా హత్య చేసేందుకు పక్కా ప్లాన్ చేశారు. దాన్ని అమలు చేసిన రోజున ఏమేం చేశామన్నది దస్తగిరి చెప్పారు. అతని మాటల్లోనే వివేకా హత్య ఎలా చేశామన్నది ఇలా చెప్పుకొచ్చాడు.
సునీల్ యాదవ్ చెప్పినట్లే వివేకా హత్యకు ఉపయోగించేందుకు వీలుగా గొడ్డలిని కొనుక్కొచ్చాను. దొరికిపోకుండా ఉండటానికి వీలుగా పులివెందులలో కాకుండా కదిరికి వెళ్లి గొడ్డలిని కొనుక్కొచ్చాను. ఆ విషయాన్ని సునీల్ యాదవ్ కు చెప్పాను. పులివెందులలో వివేకా ఇంటికి వచ్చేయాలన్నాడు. అక్కడ ఎవరూ లేరని ఫోన్లో గంగిరెడ్డి తనకు చెప్పినట్లు సునీల్ నాకు చెప్పాడు. ఇంటికి సమీపానికి చేరుకొని మద్యం తాగుతూ ఉన్నాం.
రాత్రి 11.40 గంటల సమయంలో వివేకా కారులో ఇంటికి రావటం చూశాం. అనంతరం ఉమా శంకర్ రెడ్డి పల్సర్ బైకు పైన గంగిరెడ్డిని ఎక్కించుకొని వివేకా ఇంటి వద్ద దించేసి మా దగ్గరకు వచ్చాడు. రాత్రి ఒకటిన్నర గంటల వరకు ముగ్గురం మద్యం తాగుతూనే ఉన్నాం. మేం ముగ్గురం (నేను.. సునీల్.. ఉమాశంకర్) సునీల్ బైకు మీద వివేకా ఇంటి వెనక్కి వచ్చి పార్కు చేశాం. కాంపౌండ్ లోపలకు దూకి ముందు వాకిలి వద్ద వాచ్ మెన్ రంగన్న పడుకొని ఉండటం చూశా.
సైడ్ తలుపును తట్టాం. లోపల నుంచి తలుపు తీసిన గంగిరెడ్డి లోపలకు రావాలన్నాడు. ఆ టైంలో ఇంట్లోకి వస్తున్న మమ్మల్ని చూసిన వివేకా.. ఈ టైంలో వీళ్లు ఎందుకు వచ్చారు? అని అడిగారు. బెంగళూరు సెటిల్ మెంట్ డబ్బుల గురించి మాట్లాడటానికి వచ్చినట్లుగా గంగిరెడ్డి చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన వివేకా గంగిరెడ్డి పైకి వచ్చాడు. నన్ను సెటిల్ మెంట్ డబ్బుల వాటా ఎందుకు అడుగుతున్నావ్? అని కోపడ్డాడు.'సెటిల్ మెంట్ చేసింది నేనుఅయితే డబ్బులు ఎందుకు అడుగుతున్నావు' అని మండిపడ్డారు.
హాల్లో నుంచి బెడ్రూంలోకి వివేకా వెళ్లారు.ఆ సమయంలో వివేకాను అసభ్యంగా తిట్టిన సునీల్.. ఆయన ముఖం మీద కొట్టాడు. ఆయన వెనక్కి పడిపోయారు. ఉమాశంకర్ రెడ్డి నా దగ్గరున్న గొడలి తీసుకొని వివేకా తలపై కొట్టటంతో రక్తం వచ్చింది. సునీల్ వివేకా ఛాతీపై ఎడెనిమిదిసార్లు బలంగా కొట్టాడు.
మరోవైపు గంగిరెడ్డి.. సునీల్.. ఉమాశంకర్ రెడ్డిలు డాక్యుమెంట్ల కోసం ఇల్లంతా వెతుకుతూ ఉన్నారు. ఇది చూసిన వివేకా వారిని గట్టిగా అరిచారు. దీంతో నేను ఆయన కుడి అరచేతి మీద గొడ్డలితో కట్టి.. గాయపరిచాను. కాసేపటికి అన్ని డాక్యుమెంట్లు దొరికాయి. మేం తప్పించుకోవటానికి వీలుగా డ్రైవర్ ప్రసాదే తనను చంపి పారిపోయాడని.. అతడ్ని వదలొద్దంటూ వివేకాతోనే బలవంతంగా ఒక లేఖ రాయించి.. సంతకం పెట్టించాం. తర్వాత బాత్రూంలోకి తీసుకెళ్లాం.
వివేకాను చంపుదామని గంగిరెడ్డి చెప్పాడు. దీంతో వివేకాను బాత్రూంలోకి తీసుకెళ్లి పడేశాం. ఉమాశంకర్ రెడ్డి వివేకా తలపై ఐదారుసార్లు దాడి చేయటంతో ఆయన చనిపోయారు. తర్వాత గంగిరెడ్డి మొయిన్ రోడ్డు వైపు వెళుతుంటే రంగన్న లేచి ఎవరు. అని అరిచాడు. నేను.. సునీల్.. ఉమాశంకర్ రెడ్డి ప్రహరీ గోడ దూకి బయటపడ్డాం. గొడ్డలిని సునీల్ కు ఇచ్చేసి ఇంటికి వచ్చాను. ఉదయం ఐదు గంటలకు సునీల్.. నేను .. గంగిరెడ్డి ఇంటికి వెళ్లాం.
మీరే భయపడొద్దు.. నేను శంకర్ రెడ్డి.. వైఎస్ అవినాస్ రెడ్డిలతో మాట్లాడాను. వారు చూసుకుంటామని భరోసా ఇచ్చారు. మీకు ఇవ్వాల్సిన మిగిలిన డబ్బులు కూడా ఇచ్చేస్తానని గంగిరెడ్డి చెప్పాడు. 2019 మార్చి 15న పోలీసులు మమ్మల్ని విచారణకు పిలిచారు. అప్పుడు గంగిరెడ్డి.. మీరేం భయపడొద్దు.. హత్య జరిగిన ప్రదేశంలో రక్తాన్ని తుడిచేశా.. ఆధారాలు ఏమీ లేకుండా చేశానని చెప్పాడంటూ హత్య జరిగిన వైనాన్ని దస్తగిరి వివరంగా చెప్పుకొచ్చాడు.