మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ కి దూరం కాలేదు. అవును ఇది నిజం. అందుకే ఆయనకు కొత్త ఐడీ కార్డు ఇచ్చారు. అలాగే ఏపీసీసీ డెలిగేట్ గా చేసి అయిదేళ్ల కాలపరిమితితో అందమైన చిరు ఫోటోతో కలిపి ముద్రించిన కార్డు ఇచ్చారు. కోవూరు నుంచి పీసీసీ ప్రతినిధిగా చిరంజీవిని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ ఐడీకార్డును జారీ చేసింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న మధుసూదన్ మిస్త్రీ సంతకం కూడా దీని మీద ఉంది.
సో చిరు ఇపుడు రాజకీయాల్లో ఉన్నట్లే. ఆయన తానుగా విడుదల చేసిన పది సెకన్ల ఆడియో ఇలా నిజం అయింది. నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ ఆయన ఏ ముహూర్తాన అన్నారో కానీ ఆయనని వెంటనే కాంగ్రెస్ మావాడు అంటూ స్టాంప్ వేసేసింది. ఇక్కడ విషయం ఏంటి అంటే చిరంజీవి కాంగ్రెస్ ద్వారానే కేంద్ర మంత్రి అయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఆరేళ్ళ పదవిని నిర్వహించారు.
ఆ పదవీకాలం 2018తో పూర్తి అయింది. అంటే ఇప్పటికి నాలుగేళ్ళు అయింది అన్న మాట. అయితే చిరంజీవి కాంగ్రెస్ కి ఈ రోజుకీ రాజీనామా చేయలేదు. దాంతో ఆయన ఇంకా ఆ పార్టీ మనిషిగానే వారు చూస్తున్నారు. ఆ మధ్యన రాహుల్ గాంధీ ఉభయ తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయాలని సంకల్పించినపుడు కొందరు కీలక నాయకులను ఢిల్లీ రప్పించుకున్నారు. వారితో ఆయన చర్చలు జరుపుతూ చిరంజీవి గురించి భోగట్టా చేశారని వార్తలు వచ్చాయి.
అంటే కాంగ్రెస్ హై కమాండ్ దృష్టిలో కూడా చిరంజీవి ఉన్నారు. ఆయన్ని తమతోనే ఉండేలా చూసుకోవాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. అయితే చిరంజీవి నుంచే ఎపుడూ సిగ్నల్స్ రావడంలేదు. కానీ ఈ నాలుగేళ్ల తరువాత ఫస్ట్ టైమ్ ఆయన నా నుంచి రాజకీయాలు దూరం కాలేదు అని ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారో అంతే అర్జంటుగా కాంగ్రెస్ ఆయన్ని ఆకర్షించేసింది.
అయితే చిరంజీవి కొత్త సినిమా గాడ్ ఫాదర్ కోసం ఈ మెగా డైలాగ్ ని ఆయన రిలీజ్ చేశారని అంటున్నారు. అది ప్రమోషన్ లో భాగమే అని కూడా అంటున్నారు. అదే సమయంలో వర్తమాన రాజకీయ పరిస్థితులకు కూడా ఈ డైలాగ్ సరిపోవడంతో చిరంజీవి ఒక్క డైలాగ్ మీదనే పెద్ద ఎత్తున డిబేట్లు టీవీలలో పెట్టేశారు. సందట్లో సడేమియా అన్నట్లుగా కాంగ్రెస్ కూడా చిరు మావాడేనని ఖద్దరు కండువా కప్పేసింది.
మరి ఇంతకీ చిరంజీవి ఈ డైలాగ్ సినిమా ప్రమోషన్ కోసమే వేశారా లేక రాజకీయాల కోసం వేశారా అన్నది ఎవరికీ తెలియడంలేదు. అదే టైమ్ లో ఆయన ప్రస్తుతం వరసబెట్టి సినిమాలు చేస్తున్నారు. ఆయన నోట రాజకీయం మాట వినిపించడంలేదు. ఆయన కోరుకుంటే చాలా పార్టీలు పెద్ద పదవులే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.
కానీ మెగా స్టార్ నోరు విప్పడంలేదు. ఇపుడు ఆయనకు కాంగ్రెస్ ఐడీ కార్డు ఇచ్చింది దీని మీద ఆయన ఏమంటారో చూడాలి. ఇక ఈ ఐడీ కార్డుతో ఆయన అక్టోబర్ 17న జరగబోయే ఎన్నికల్లో ఏఐసీసీ అధ్యక్షుడి ఎన్నికకు ఓటు చేసే హక్కుని సంపాదించుకున్నారు. వంద మందికి మాత్రమే పీసీసీ లెవెల్ లో ఈ చాన్స్ ఉంటుంది. అలా చిరంజీవికి ఈ అవకాశం వచ్చింది. సో ఆయన రాజకీయ అరంగేట్రానికి ఇది నిదర్శనమా. ఏమో వెయిట్ అండ్ సీ.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.