సెక్సు రెగ్యులర్ గా చేయకుంటే ఇన్ని నష్టాలా?

Update: 2021-10-22 03:30 GMT
‘సెక్సు’ అన్న పదాన్ని చూసినంతనే.. అంతకు మించిన పాపం మరొకటి ఉండదన్నట్లుగా ఫీలయ్యే వారు ఇప్పటికి ఉన్నారు. జీవితంలో ముఖ్యమైన దాని గురించి మాట్లాడుకోవటం.. అవగాహన పెంచుకోవటం తప్పే కాదు. అదేదో చీకటి కార్యంలా భావించే వారి మైండ్ సెట్ మారాల్సిన అవసరం ఉంది. నిజానికి మనిషిలోని చాలా వికారాలకు కారణం.. సెక్సు లైఫ్ సరిగా లేకపోవటమే. విపరీతమైన ఆకలి ఉన్న వాడు.. ఏం పెట్టినా ఫర్లేదనుకుంటాడు. అదే రీతిలో.. సెక్సు జీవితాన్ని సరిగా అనుభవించలేని వాడు.. రకరకాల సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటాడు. అందుకే.. సెక్సు మీద అవగాహన పెంచుకోవట.. దాని మీద ఉన్న అప్రపధల్ని తొలగించుకోవాల్సిన అవసరం ఉంది.

తాజాగా బయటకు వచ్చిన ఒక అధ్యయనం ప్రకారం సెక్సును రెగ్యులర్ గా చేయటం చాలా అవసరమని స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు.. సెక్సులో పాల్గొన్న వారి శరీరం అలసిపోయి.. చక్కటి వ్యాయామంలా పని చేస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. రెగ్యులర్ గా సెక్సు చేసే వారిపై ఒత్తిడి కూడా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అధికంగా సెక్సు చేస్తే.. బాడీ షేప్ పాడైపోతుందన్న పిచ్చి ఆలోచనలు కూడా ఉంటాయి. కానీ.. అందులోనిజం లేదని స్పష్టం చేస్తున్నారు.

నిజానికి సెక్సుకు దూరంగా ఉండే వారే త్వరగా యవ్వనాన్ని కోల్పోవటం ఖాయమంటున్నారు. నెలకు రెండు మూడుసార్లు లైంగిక కార్యకలాపాలకు పాల్పడితే.. వయసుత్వరగా రాదని చెబుతున్నారు. అంతేకాదు.. లైంగిక చర్యలో పాల్గొనే వారికి ఆరోగ్య సమస్యలు కూడా దగ్గరకు రావంటున్నారు. రెగ్యులర్ గా సెక్సు చేసే వారిలో రక్తపోటు సమస్య తక్కువగా ఉంటుందని.. శృంగార జీవితం తక్కువగా ఉన్న వారిలో ఇతర మానసిక సమస్యల్ని ఎదుర్కొంటారని చెబుతున్నారు. వారానికి కనీసం రెండుసార్లు లైంగిక చర్యలో పాల్గొనే వారు బలమైన శరీరాన్ని కలిగి ఉంటారని చెబుతున్నారు.అంతేకాదు.. సెక్సు జీవితం సరిగా లేని వారు.. తమ పనిలోనూ ఎఫెక్టివ్ గా ఉండరన్న మాటను చెబుతున్నారు. సో.. సెక్సు జీవితాన్ని ఒకసారి రివ్యూ చేసుకొని.. మార్పులుచేర్పులు ఏమైనా ఉంటే చేసుకోవటం చాలా మంచిది.


Tags:    

Similar News