కరోనా ఫస్ట్ వేవ్ లో విజృంభణ సమయంలో , ఆ మహమ్మారి కట్టడి కోసం లాక్ డౌన్ విధించిన సమయంలో చాలా మంది మద్యం దొరక్క వింతగా ప్రవర్తించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. హైదేరాబద్ ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో ఎంతోమంది చేరారు. కొంతమంది పిచ్చివాళ్లలాగా ప్రవర్తించారు. ప్రతీ రోజు మద్యం సేవించేవారు ఒక్కసారిగి లేకపోవడంతో వింతగా ప్రవర్తించారు. మందు, సిగరెట్, జూదం అనేవి ఒక వ్యసనం లాంటివి. ఒక్కసారి అలవాటు పడితే మానడం చాలా కష్టం. అయితే ఓ పెద్దాయన రోజూ పల్లెటూర్లలో దొరికే కల్లు తాగేవాడు. కల్లు ఆయనకి ఓ వ్యసనంలా తయారైంది. అయితే అతడికి ఈ మధ్యన కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరాడు.
మొదటి రోజు ట్రీట్ మెంట్ తీసుకున్న తర్వాత తెల్లారే సరికి కనిపించలేదు. ఆసుపత్రి వర్గాలు ఆరా తీయగా ఆసుపత్రి నుంచి పారిపోయినట్లు తెలిసింది. పోలీసులకు సమాచారం అందించడంతో వారి ద్వారా అతని ఆచూకీ కనుకున్నారు. పారిపోవడానికి గల కారణం ఏంటని అడిగితే ఆసుపత్రిలో కల్లు దొరకడం లేదని, అందుకే వచ్చినట్టు తెలిపాడు. అంబులెన్స్ ఎక్కాలని ఎంత చెప్పినా వినలేదు. కల్లు ఇస్తేనే తాను అంబులెన్స్ ఎక్కి ఆసుపత్రికి వస్తాను అని బీష్మించు కూర్చున్నాడు. దీంతో చేసేది లేక పోలీసులు రెండు లీటర్ల కల్లు తెప్పించి అతడికి ఇచ్చారు. అది సేవించిన అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మానగర్ గ్రామానికి చెందిన ఓ 55 ఏళ్ల స్థానికుడు కారోనా బారిన పడ్డాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో కుటుంబసభ్యులు కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అతడికి మొదటి నుంచి కల్లు సేవించే అలవాటు ఉంది. ఒకరోజు చికిత్స తీసుకున్నాడు. ఆ మరుసటి రోజు తెల్లారి కల్లు లేక ఆసుపత్రిని నుంచి పారిపోయాడు. ప్రతీ రోజు ఉదయం చెకప్ కి వచ్చే వైద్యులు రోగి లేకపోవడంతో సిబ్బందిని అడిగారు. తమకు తెలియదని సమాధానం చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్ అధికారులు తనిఖీ చేపట్టారు. బాధితుడు సంగమేశ్వర కాలనీలోని వాటర్ ట్యాంక్ వద్ద ఓ మూలన అర్ధనగ్నంగా కూర్చొని కనిపించాడు. దీనితో అతడిని ఆసుపత్రి నుంచి ఎందుకు వచ్చావని పోలీసులు ప్రశ్నించగా, ఆసుపత్రిలో కల్లు దొరకలేదు, అందుకు పారిపోయి వచ్చానని సమాధానం ఇచ్చాడు. వెంటనే అంబులెన్స్ ఎక్కాలని పోలీసులు కరోనా బాధితుడిని కోరగా, అందుకు అతడు అంగీకరించలేదు. తనకు కల్లు పోస్తేనే ఆసుపత్రికి వస్తానని మంకు పట్టు పట్టాడు. దీంతో పోలీసులు రెండు లీటర్ల కల్లు తీసుకొచ్చి కరోనా బాధితుడి చేతిలో పెట్టారు. అది తాగిన తర్వాత అతడిని అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు.