లాక్ డౌన్ సమయంలోలో భారతీయులు ఏం చేశారంటే?

Update: 2021-03-30 07:30 GMT
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికించింది. అగ్రదేశాలు, చిన్న దేశాలు అనే తేడా లేకుండా విశ్వరూపం చూపించింది. గతేడాది మొదలైన వైరస్ విజృంభణ నేటికీ ఆగలేదు. ఇప్పటికీ కోరలు చాస్తూనే ఉంది. చాపకింద నీరులా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గతేడాది మార్చిలో కొవిడ్ ఉగ్రరూపం దాల్చడంతో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. ఫలితంగా ఎక్కడి పనులు అక్కడే నిలిపోయాయి. ఆటో డ్రైవర్ నుంచి వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు సైతం ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ కష్టకాలంలో తిండిలేక ఆకలితో ఆలమటించిన కడుపులు ఎన్నో. చేయడానికి పని లేక, చేతిలో చిల్లిగవ్వ లేక ఎన్నో డొక్కలు పీక్కుపోయాయి. ఎంతో మంది పిక్కబలాన్ని ఉపయోగించి వందల కిలోమీటర్ల మేర సాహసయాత్రలు చేశారు. మరికొందరి జీవితాల్లో మాత్రం మరిచిపోలేని ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. తినడానికి తీరిక లేకుండా పని చేసే వారు సైతం కుటుంబ సభ్యులతో గడిపారు.

కరోనా వేళ ఎక్కడికి పనులు అక్కడే పోగా జనాలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ సమయంలో భారతీయులు ఏం చేశారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఓ సంస్థ వెల్లడించిన ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. లాక్ డౌన్ వేళ భారతీయులు ఫోన్లకే పరిమితమయ్యారట. దాదాపు 45 శాతం మంది ఆన్ లైన్ గేమింగ్ తో కాలక్షేపం చేశారట. ప్రపంచ దేశాలు కరోనాతో కొట్టుమిట్టాడుతుంటే భారత్ లో మాత్రం ఫోన్ల వినియోగం మరింతగా పెరిగిందట. కేవలం ఆన్ లైన్ గేమింగ్ మాత్రమే కాకుండా ఇతర అనువర్తనాలు, వాటి వాడకంలో భారతీయులు బిజీ అయ్యారట.

ఫోన్లలో దాదాపు 45 శాతం మంది ఫోన్లలో గేమింగ్ తో కాలాన్ని గడిపారని ఆ సర్వే తెలిపింది. ఇక ఇంటి నుంచి పని చేసే వాళ్లు సైతం విరామ సమయంలో ఫోన్లకే టైం కేటాయించారని వివరించింది. మిగతావారు ఇంట్లో ఇతర పనులు చేస్తూనే 84 శాతం మంది ఆన్ లైన్ గేమింగ్ లో పాల్గొన్నారని ఆ సర్వే వెల్లడించింది. పిల్లలు, పెద్దలు, ఆడ, మగ తేడా లేకుండా ఆన్ లైన్ గేమింగ్ తో కాలక్షేపం చేసినట్లు పేర్కొంది. ఇందులో మహిళలే 43 శాతం ఉండడం గమనార్హం. ఇక ఆన్ లైన్ గేమింగ్ తో సమయాన్ని గడిపిన వారిలో 12 శాతం మంది 25 నుంచి 44 ఏళ్ల మధ్యవారని పేర్కొంది. 45 ఏళ్ల పైబడిన వారు 28 శాతం కాలక్షేపం చేశారని వివరించింది. ఇక లాక్ డౌన్ సమయంలో ఫోన్ లో గేమింగ్ టైమ్ కూడా దాదాపు రెట్టింపు అయినట్లు తెలిపింది.

లాక్ డౌన్ భారతీయులల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చింది. అటు ఆరోగ్యంపై శ్రద్ధతో పాటే ఇటు సాంకేతికతను చాలా మందికి అందుబాటులోకి తెచ్చింది. ఆన్ లైన్ క్లాసుల పేరిట సెల్ ఫోన్, ట్యాబ్, కంప్యూటర్ వంటి విక్రయాలు పెరిగాయి. తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్, చౌకగా అన్ లిమిటెడ్ డేటా, పనులన్నీ ఆగిపోవడంతో అందరూ మొబైల్ గేమింగ్ పై ఆసక్తి కనబర్చారని విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా జనాభాలో సగం ఆన్ లైన్ గేమింగ్ తో కాలక్షేపం చేయడం గమనార్హమే. ఫలితంగా లాక్ డౌన్ లోనే సైబర్ నేరాలు ఎక్కువయ్యాయని అధికారులు ఇప్పటికే ప్రకటించారు.
Tags:    

Similar News