టీకాలు ఏం చేయలేవా? థర్డ్ వేవ్ తప్పదా?

Update: 2021-06-20 07:06 GMT
భారతదేశంలో మొట్టమొదట గుర్తించిన డెల్టా వేరియంట్ కారణంగా ఇంగ్లాండ్‌లో కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ల తీవ్రత పెరుగుతోందని.. దీని వల్ల ఖచ్చితంగా థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని" అని బ్రిటిష్ ప్రభుత్వ సలహా శాస్త్రవేత్త సంచలన వ్యాఖ్యలు చేశారు. "టీకా కార్యక్రమం మందకొడిగా కొనసాగుతోందని.. డెల్టా వేరియంట్ థర్డ్ వేవ్ మధ్య రేసు గట్టిగా ఉంది" అని ఆయన తెలిపారు. టీకా -రోగనిరోధకతపై సంయుక్త కమిటీ (జెసివిఐ) సభ్యుడు ప్రొఫెసర్ ఆడమ్ ఫిన్ ఈ మేరకు యూకే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. "కరోనా వైరస్ డెల్టా వేరియంట్ తీవ్రత వేగంగా పెరగడం లేదు, అయితే ఇది భవిష్యత్ లో పెరుగుతుంది.. కాబట్టి ఈ మూడోవేవ్ ఖచ్చితంగా ఉంటుంది" అని తెలిపాడు.

డెల్టా వేరియంట్ అత్యధిక కేసులు 16-25 సంవత్సరాల వయస్సు వారికి వస్తున్నాయని..  వృద్ధులకు ప్రమాదం పొంచి ఉందని.. "ఆసుపత్రిలను రెడీ చేయాలని ఫ్రొఫెసర్ ఫిన్ ప్రభుత్వానికి సూచించారు. "వ్యాక్సిన్ల విషయానికొస్తే, ఈ సమయంలో ప్రతిచోటా ప్రధాన ప్రాముఖ్యత పెద్దలకు వేస్తున్నారు. వారికి రోగనిరోధక శక్తిని ఇస్తుంది, ఎందుకంటే ఈ సంక్రమణతో ఎక్కువగా బాధపడే పెద్దలు సేఫ్ అవుతారు" అని ఆయన చెప్పారు.

"రాబోయే కొద్ది వారాల్లో బ్రిటన్ లో థర్డ్ వేర్ రావొచ్చని ఆసుపత్రులన్నీ నిండిపోతాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనవరిలో  తిరిగి అదే స్థాయిలో తగ్గిపోతుందని అంటున్నారు పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ ఇటీవల ప్రచురించిన డేటా ప్రకారం.. డెల్టా వేరియంట్ నుంచి రెండు డోసులు వేసుకున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వల్ల ఆసుపత్రిలో చేరకుండా 92 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని.. రెండు డోసుల తర్వాత ఆసుపత్రిలో చేరకుండా ఫైజర్ వ్యాక్సిన్ 96 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని తేలింది.

కరోనావైరస్ వ్యాక్సిన్ మొదటి డోసును బ్రిటన్ దేశంలో 42.4 మిలియన్లకు పైగా ప్రజలకు ఇచ్చారు. 30.8 మిలియన్లకు పైగా ప్రజలకు రెండో డోసు పూర్తిగా టీకాలు వేసినట్లు తాజా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కరోనావైరస్ రాబోయే సంవత్సరాల్లో మరింతగా విస్తరిస్తుందని నిపుణులు హెచ్చరించారు, చివరికి సంక్రమణ లేదా కొత్త వైవిధ్యాల వల్ల కలిగే వ్యాధుల నుండి టీకాలు కూడా రక్షించడంలో విఫలమవుతాయని హెచ్చరిస్తున్నారు.
Tags:    

Similar News