'ఎసెన్షియల్’ అంటే అర్థమేంటి? సంచలనంగా అంబానీ కొడుకు వ్యాఖ్య

Update: 2021-04-07 12:30 GMT
రోటీన్ కు భిన్నమైన పరిణామం చోటు చేసుకుంది. ఎప్పుడు నోరు విప్పని వ్యాపార దిగ్గజం.. అందుకు భిన్నంగా ఆయన కుమారుడు మాత్రం పెదవి విప్పి చేసిన వ్యాఖ్య ఇప్పుడు సంచలనంగా మారింది. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పెద్ద కుమారుడు అన్మోల్ అంబానీ చేసిన వ్యాఖ్య ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రిలయన్స్ క్యాపిటల్ డైరెక్టర్ అనిల్ అంబానీ సంచలన వ్యాఖ్య చేశారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపారాలపై విధించిన ఆంక్షలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నటులు.. ప్రొఫెషనల్ క్రికెటర్లు.. రాజకీయ నేతలకు లేని ఆంక్షలు వ్యాపారాలకు ఎందుకంటూ సీరియస్ అయిన ఆయన..  'ఎసెన్షియల్' అంటే ఏమిటంటూ సరికొత్త ప్రశ్నను సంధించారు. తనకొచ్చిన సందేహాల్ని వరుస ట్వీట్లతో ఆయన మహా సర్కారుపై విమర్శలు సంధించారు.

ఎవరి పని వారికి అత్యవసరమే అంటూ మహారాష్ట్ర సర్కారుకు మింగుడుపడని రీతిలో స్పందించిన ఆయన.. ప్రొఫెషనల్ నటులు వారి సినిమా షూటింగ్ లు కొనసాగించొచ్చు.. ప్రొఫెషనల్ క్రికెటర్లు అర్థరాత్రి వరకు ఆడుకోవచ్చు. ప్రొఫెషనల్ రాజకీయ నేతలు భారీగా గుమిగూడిన జనాలతో ర్యాలీలను కొనసాగించొచ్చు.. కానీ వ్యాపారం లేదా.. పని  'ఎసెన్షియల్' కాదా? అంటూ ప్రశ్నల పరంపరను సంధించారు. ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో కేసుల నమోదు తీవ్రతరం కావటం తెలిసిందే.

దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర నిలుస్తోంది. దేశ వ్యాప్తంగా రోజులో 90వేలకు పైగా కేసులు నమోదైతే.. ఒక్క మహారాష్ట్రలోనే 60 వేలకు పైగా కేసులు నమోదు కావటం ఆందోనకు గురి చేస్తోంది. దీంతో.. పాక్షిక లాక్ డౌన్ ను విధిస్తూ మహా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రిళ్లు కర్ఫ్యూతో పాటు.. సినిమాహాళ్లు.. పార్కులు.. మ్యూజియంలు.. రెస్టారెంట్లు.. అన్ని మత ప్రదేశాలు మూసి ఉంచాలని.. ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాలని ఆదేశించటం తెలిసిందే. ఇలాంటివేళ.. అనిల్ అంబానీ పెద్ద కుమారుడి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీనిపై మహా సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News