ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితులపై ‘జర్నల్ జామా’ ఏం చెప్పింది?

Update: 2021-04-10 00:30 GMT
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ధాటికి కోట్లాది మంది ప్రభావితం కావటమే కాదు.. లక్షల్లో మరణాలు చోటు చేసుకున్నాయి. కరోనా పాజిటివ్ గా తేలిన వారిలో చాలామంది చాలా రకాలైన సమస్యలతో ఇబ్బంది పడే పరిస్థితి. కరోనా కారణంగా చోటు చేసుకున్న సామాజిక.. ఆర్థిక.. వ్యక్తగత అంశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపటం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వీడన్ కు చెందిన డాండ్రెయెడ్ ఆసుపత్రి.. కరోలిన్సా్క ఇనిస్టిట్యూట్‌  కలిసి జర్నల్ జామా ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. అందులో పలు ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు. అవేమంటే..

-  కరోనా సోకిన ప్రతి పది మందిలో ఒకరిపై వైరస్ దుష్ప్రభావాలు దీర్ఘకాలం కనిపిస్తున్నాయి.
-  కరోనా పాజిటివ్ గా తేలిన వారిలో వాసన.. రుచి ఎక్కువగా పోయింది.
-  ఆలస.. శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు దీర్ఘకాలం కనిపించలేదు.
-  కరోనా వచ్చి తగ్గిన వారిలో ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రక్త నమూనాల్ని సేకరించి పరీక్షిస్తే.. ప్రతి పది మందిలో ఒకరికి దుష్ప్రభావాలు ఉన్నట్లుగా తేలింది.
-  కరోనా కారణంగా వ్యక్తిగతంగానూ ఇబ్బందులకు గురవుతున్నారు.
Tags:    

Similar News