28న ఏపీలో ఏం జరగబోతోంది.?

Update: 2019-02-27 04:34 GMT
ఏపీలో ఇన్నాళ్లు చూసింది ట్రైలరే.. ఇప్పుడు అసలు సిసలు సినిమా మొదలవబోతోంది. ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద 28వ తేదీన ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.

ఓ వైపు అధికార టీడీపీ - మరో వైపు ప్రతిపక్ష వైసీపీ కొత్త కొత్త ఎత్తులతో వ్యూహాలు సిద్ధం చేస్తుండడంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. లండన్ పర్యటన ముగించుకొని జగన్ తిరిగి రావడంతో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ కు పదునుపెట్టింది వైసీపీ. ఈసారి లోటస్ పాండ్ కాకుండా తాడేపల్లి కేంద్రంగా ఆపరేషన్ ఆకర్ష్ మంత్రాన్ని పఠించబోతోంది. ఇందుకోసం డేట్ కూడా ఫిక్స్ చేసింది.  బుధవారం తాడేపల్లి లో జగన్ గృహ ప్రవేశం చేస్తారు. ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

తాడేపల్లి కు చేరగానే తన రాజకీయ వ్యూహాలను చకచకా అమలు చేసేందుకు జగన్ సిద్ధమయ్యారు. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి దగ్గుబాటి హితేష్ తొలుత వైసీపీలో చేరే ముహూర్తాన్ని జగన్  ఖరారు చేశారు. ఇక్కడి నుంచి ఇక వరుసగా నేతలను పార్టీలో చేర్చుకునే స్కెచ్ గీశారు. బుధవారం కేంద్ర మాజీ మంత్రి కిల్లీ కృపారాణి వైసీపీ కండువా కప్పుకుంటారు. వల్లభనేని వంశీ మోహన్ కూడా జగన్ ను కలసి వైసీపీ లో చేరతారని ప్రచారం సాగుతోంది. వీరేకాక మరికొంత మంది ప్రతినిధులు వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి జగన్ ను కలిసి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

ఇక జగన్ ఆపరేషన్ ఆకర్ష్ కు ధీటుగా 28వ తేదీన పెద్దనేతలకు గాలం వేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు స్కెచ్ గీశారు. కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఫ్యామిలీని టీడీపీ సైకిలెక్కిస్తారట.. కొణతాలను చేర్చుకుంటారట..ఇక కర్నూలు జిల్లా పాండ్యా వైసీపీ ఎమ్మెల్యే చరితను టీడీపీలో చేర్పించుకునేందుకు 28న ముహూర్తం ఖరారు చేశారు బాబు..

అటు వైసీపీలోకి - ఇటు టీడీపీలోకి 28వ తేదీన పెద్ద ఎత్తున చేరికలకు చంద్రబాబు - జగన్ స్కెచ్ గీయడంతో ఎవరెవరు ఏఏ పార్టీల్లో చేరుతారనే టెన్షన్ ఏపీ పొలిటికల్ స్క్రీన్ ను వేడెక్కిస్తోంది.
 



Tags:    

Similar News