చెన్నై ప్రధాన కేంద్రంగా బ్యాంకింగ్ సేవలు అందించే లక్ష్మీ విలాస్ బ్యాంక్ కు సంబంధించిన కొన్ని పరిణామాలు సంచలనంగా మారాయి. ఆ బ్యాంకులో డబ్బులు దాచుకున్న డిపాజిటర్లు విత్ డ్రా చేసుకోవటానికి వీల్లేకుండా ఆర్ బీఐ ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ బ్యాంకుపై ఆర్ బీఐ సమర్పించిన దరఖాస్తు ఆధారంగా కేంద్ర ఆర్థిక శాఖ మారిటోరియం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
దీంతో.. డిసెంబరు 16 వరకుఈ బ్యాంకు డిపాజిట్ దారులు నెలలో రూ.25వేల కంటే ఎక్కువ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోలేరు. ఒకవేళ తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉండి.. అందుకు అవసరమైన డబ్బుల కోసం ప్రత్యేకంగా అప్లికేషన్ పెడితే.. పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. అదే సమయంలో చదువు కోసం.. పెళ్లి లాంటి వాటి కోసం కూడా మినహాయింపులు ఉంటాయి. ప్రస్తుతం ఈ బ్యాంకు ఆర్ బీఐ పరిధిలోకి వెళ్లింది. భారీ ఎత్తున నష్టాలు నమోదుచేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఇదే తరహాలో ఈ ఏడాది యస్ బ్యాంకు మీద కూడా మారిటోరియం విధించటం తెలిసిందే. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొన్న వేళ.. ఆర్ బీఐ ఎంట్రీ ఇచ్చి.. యస్ బ్యాంకు ఇష్యూనుపరిష్కరించిందని చెప్పాలి. గడిచిన మూడేళ్లుగా లక్ష్మీ విలాస్ బ్యాంకు నష్టాల్లోనే సాగుతుందని చెబుతున్నారు. దీనికి తోడు మొండి బకాయిలు బ్యాంకు నిర్వహణకు మరింత ఇబ్బందికరంగా మారింది. పాలనాపరమైన లోపాలే తాజా పరిస్థితికి కారణంగా చెబుతున్నారు.
1926లో వీఎస్ఎన్ రామలింగ చెట్టియార్ మరో ఏడుగురుతో కలిసి ఈ బ్యాంకును ప్రారంభించారు. ఈ బ్యాంకు కు 19 రాష్ట్రాలు.. ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నారు. 566 బ్రాంచీలు.. 918 ఏటీఎంలు సేవలు అందిస్తున్నారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ బ్యాంకుకు సుమారు 50 శాఖలు ఉన్నాయి. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో ఈ బ్యాంకు షేరు విలువ రూ.15.50గా నమోదైంది.
ఆర్ బీఐ మారిటోరియం నేపథ్యంలో ఇప్పుడేం కానుందన్నది ప్రశ్న. ఈ బ్యాంకులో పెట్టుబడి పెట్టేందుకు సింగపూర్ కు చెందిన డీబీఎస్ బ్యాంక్ లిమిటెడ్ముందుకు వచ్చింది. దాదాపు రూ.2500 కోట్ల నిధుల్ని సమకూరుస్తామని చెప్పినట్లు చెబుతున్నారు. ఈ డీల్ కాని ఫైనల్ అయితే.. లక్ష్మీ విలాస్ బ్యాంకును చుట్టుముట్టిన ఆర్థిక కష్టాల నుంచి బయటపడటం ఖాయం. భారత్ లో.. అందునా దక్షిణాది రాష్ట్రాల్లో బ్యాంకింగ్ సేవల్లో బలపడాలని భావిస్తున్న డీబీఎస్ కు తాజా పరిణామం కలిసి వస్తుందన్న మాట వినిపిస్తోంది.