రాహుల్‌ గాంధీ కి జైలు శిక్ష వేసిన జ‌డ్జి కి ప్ర‌మోష‌న్‌... ఏం జ‌రిగింది?

Update: 2023-05-05 16:48 GMT
కేంద్ర ప్ర‌భుత్వానికి.. ప్ర‌భుత్వ పెద్ద‌ల కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారికి ప‌ద‌వులు ద‌క్కుతున్నాయ నే ఆరోప‌ణ‌లు.. విమ‌ర్శ‌లు కొన్నాళ్లుగా వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. నిజానికి సుప్రీంకోర్టులో అయినా.. జిల్లా కోర్టుల్లో అయినా.. ప‌నిచేసిన‌వారి విష‌యంలో ప్ర‌భుత్వాలు.. ప్ర‌భుత్వ పెద్ద‌లు త‌ట‌స్థంగా ఉండా ల‌నేది రాజ్యాంగ నియ‌మం. అందుకే కోర్టుల‌ కు స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌ల్పించారు. అయితే.. రాను రాను.. న్యాయ‌మూర్తుల విష‌యం చ‌ర్చ‌కు దారితీస్తోంది.

గ‌తంలో సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా ప‌నిచేసిన వారికి గ‌వ‌ర్న‌ర్లుగా, రాజ్య‌స‌భ స‌భ్యులుగా పంపించిన చ‌రి త్ర అంద‌రికీ తెలిసిందే. ఇక‌, తాజాగా కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌ గాంధీ కి రెండేళ్ల జైలు శిక్ష విధించినఓ జ‌డ్జి కి కూడా ఇదే త‌ర‌హాలో ప్ర‌మోష‌న్ ల‌భించ‌డం.. దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది.  2018లో క‌ర్ణాట‌క‌లో రాహుల్‌గాంధీ .. 'మోడీ' ఇంటిపేరు ఉన్న‌వారంతా దొంగ‌లే! అని వ్యాఖ్యానించార‌ని.. పేర్కొంటూ.. ఆయ‌న‌ పై బీజేపీ నాయ‌కుడు కేసు పెట్టారు.

అది కూడా గుజ‌రాత్‌లో కావ‌డం గ‌మ‌నార్హం. దీనిని విచారించిన సూర‌త్ కోర్టు.. నెల రోజుల కింద‌ట రాహుల్‌ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయ‌న ఏకంగా.. పార్ల‌మెంటు స‌భ్య‌త్వాన్ని కూడా కోల్పోయారు. ఇంత సంచ‌ల‌న మైన తీర్పు ఇచ్చిన న్యాయ‌మూర్తి.. సూర‌త్ జిల్లా కోర్టు మేజిస్టేట్. అయితే.. ఆయ‌న‌కు నెల రోజులు కూడా తిర‌గ‌క‌ముందే.. ప్ర‌మోష‌న్ ల‌భించింది.

రాహుల్ కేసును విచారించిన సూర‌త్ జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు జ‌డ్జి హరీష్ హస్ముఖ్ భాయ్ వర్మ సహా 68 మంది జ్యుడిషియల్ అధికారులకు పదోన్నతి కల్పించారు. ఈ 68 మంది న్యాయమూర్తులు 65 శాతం కోటా విధానం ఆధారంగా పదోన్నతి పొందారు. అయితే.. ఇలా ప్ర‌మోష‌న్ క‌ల్పించ‌డం వివాదంగా మారింది.

68 మందికి పదోన్నతి కల్పించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ ను మే 8న విచారించనుంది. సీనియర్ సివిల్ జడ్జి కేడర్‌ కు చెందిన ఇద్దరు జ్యుడీషియల్ అధికారులు రవి కుమార్ మెహతా, సచిన్ ప్రతాప్రయ మెహతా సవాలు చేశారు. మార్చి 10న గుజరాత్ హైకోర్టు జారీ చేసిన పదోన్నతుల జాబితాను రద్దు చేయాలని పిటిషన్‌లో డిమాండ్ చేశారు.

Similar News