ఇప్పుడంతా టీకా విషయాలే నడుస్తున్నాయి. భారత్ లో రెండు వ్యాక్సిన్లకు కేంద్రం ఓకే చెప్పటం.. వాటిని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియ మొదలైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలంగాణలో ఈ నెల 11న ఏపీలోనూ దాదాపుగా సంక్రాంతి తర్వాత నుంచి టీకా వేసే కార్యక్రమం మొదలువుతుందన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. టీకాకు సంబంధించి బోలెడన్ని సందేహాలు వెల్లువెత్తున్నాయి. అందులో కొన్ని ఆసక్తికరంగానే కాదు.. నిజమే.. మనకు ఇలాంటి సందేహాలు వస్తాయి కదా? వాటికేం చేయాలన్న భావన కలుగక మానదు.
అలాంటి ప్రశ్నల్లో ఒకటి.. వ్యాక్సిన్ వేసుకోవటానికి ముందుకానీ.. వేసుకున్న తర్వాత లిక్కర్ తాగొచ్చా? లేదా? అన్నది సందేహం. అయితే.. నిపుణుల సూచన ప్రకారం మితిమీరిన తత్త్వం సరికాదంటున్నారు. వ్యాక్సిన్ వేసుకోవటానికి ముందు.. తర్వాత మద్యం సేవించే విషయం మీద నియంత్రణ అవసరమని చెబుతున్నారు. ఇక.. ఒక వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత 28 రోజుల తర్వాత మరోసారి సెకండ్ డోస్ వేయించుకోవాల్సి ఉంటుంది.
మరి.. అలాంటప్పుడు ఏం చేయాలి? ఒకవేళ అనుకోనిది ఏమైనా జరిగితే.. సరిగ్గా 28వ రోజుతర్వాత కుదరకపోతే ఏం చేయాలన్నది మరో డౌట్. ఈ విషయానికి వస్తే.. మొదటి టీకా వేసిన తర్వాత రెండో టీకా వేసే డేట్ టైం ముందే చెప్పేస్తారు. సరిగ్గా ఆ సమయానికి వ్యాక్సిన్ వేయించటానికి రావాల్సి ఉంటుంది. ఒకవేళ.. టీకా వేసే రోజుకు అనుకోని పరిణామం చోటు చేసుకొని వ్యాక్సిన్ వేసుకోలేని పరిస్థితి ఏమీ కాదని.. కాకుంటే దీర్ఘకాలం పాటు అలా వదిలేయకుండా.. వారిచ్చిన గడువు లోపల టీకా వేయించుకుంటే ఏమీ కాదన్న భరోసాను ఇస్తున్నారు. ఏమైనా వ్యాక్సిన్ వేయించుకునే వేళలో కాస్తంత అప్రమత్తంగా ఉండాలి. అనుకోనిది ఏదైనా జరిగితే.. వీలనంత త్వరగా వ్యాక్సిన్ వేయించుకుంటే సరిపోతుందని స్పష్టం చేస్తున్నారు. సో.. క్లారిటీ వచ్చిందా?