కొవిడ్ 19 పుణ్యమా అని ఇప్పటివరకు వినని ఎన్నో మాటల్నివింటున్నాం. అదే సమయంలో వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు అంశాలపై అవగాహన కలుగుతోంది. టీకాల విషయానికి వస్తే.. బోలెడన్ని వివరాలు వెల్లడవుతున్నాయి. సాధారణంగా ఏదైనా ఇష్యూకు టీకా తయారు చేస్తుంటే.. అదో సింగిల్ కాలమ్ వార్తగా మాత్రమే మీడియాలో వచ్చేది. అది మార్కెట్లోకి విడుదల అయ్యాక కూడా అంత ప్రాధాన్యత ఇచ్చే వారు కాదు. కొవిడ్ పుణ్యమా అని.. టీకాలకు సంబంధించిన వార్తలు.. వాటి పరిశోధనలు.. టీకాల తయారీకి సంబంధించిన విశేషాలు హెడ్ లైన్స్ గా మార్చేసిన ఘనత మాత్రం కొవిడ్ దేనని చెప్పక తప్పదు.
ప్రపంచం మీదకు మహమ్మారి విరుచుకుపడిన వేళ.. వందకు పైగా ఫార్మా పరిశోధక కంపెనీలు టీకా తయారీ కోసం పెద్ద ఎత్తున పరిశోధనలు చేశారు. ఇప్పటికే పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అందులో ఎంఆర్ఎణ్ ఏ టీకాలు.. డీఎన్ఏ.. ఆర్ఎన్ఏ టీకాలంటూ రకరకాలుగా వినిపిస్తున్నాయి. అన్నింటికి మించి డీఎన్ఏ టీకా అంటే ఏమిటి? దాన్ని ఎలా డెవలప్ చేస్తారన్నది ప్రశ్నగా మారింది.
వీటి తయారీ.. వినియోగం ఎలా ఉంటుందన్న విషయానికి వస్తే.. తయారీలో తేడాలు ఉన్నా.. పని చేసే విషయంలో ఒకేలా పని చేస్తాయి. కొవిషీల్డ్.. కొవాగ్జిన్ తయారీతో పోలిస్తే.. డీఎన్ఏ వ్యాక్సిన్ల తయారీ కాస్త భిన్నంగా డీఎన్ఏ.. ఆర్ఎన్ఏ టీకాలు నేరుగా వైరస్ సొంత జన్యువులనే కొంతమేర ఉపయోగించి రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తారు. అదే సమయంలో.. కొవీషీల్డ్.. కొవాగ్జిన్ లాంటి టీకాలు.. క్రియారహిత వ్యాక్సిన్లు అన్న విషయం తెలిసిందే.
డీఎన్ఏ టీకాల్ని వేసుకున్న తర్వాత అది శరీరంలోకి వెల్లి ఆర్ఎన్ఏగా మారుతుంది. వైరల్ ఆర్ఎన్ఏ నిర్మాణాన్ని తలపిస్తూ.. రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించి.. దాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు శరీర రక్షణ వ్యవస్థను ఒక్కోసారి రిజెక్టు చేసే వీలుంది. కానీ డీఎన్ఏ వ్యాక్సిన్లకు అలాంటి ఇబ్బంది ఉండదు. మనిషి ప్రధాన జెనెటిక్ మెటీరియల్ డీఎన్ఏ కావటంతో.. డీఎన్ఏ టీకాలు మరింత సురక్షితమని చెప్పక తప్పదు.