ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాలలో బలపడాలి అని గట్టిగా అనుకుంటోంది బీజేపీ. కానీ ఆ విధంగా అనుకున్నా కూడా ఫలితాలు మాత్రం అనుకూలించడం లేదు. ఇప్పటిదాకా వైసీపీ, టీడీపీ మధ్యే పోటీ నడుస్తోంది. అంతకుమించి పరిణామాల్లో పెద్దగా ఎదుగుదల లేకుండా పోయింది. తెలంగాణలో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో బీజేపీ ప్రభావం ఈ సారి ఉండనే ఉండదని అనిపిస్తోంది. ఈ సందర్భంగా సర్వేల హవా నడుస్తోంది.
ఇక ఏపీలో అయితే బీజేపీ,టీడీపీ కలిసి పోటీ చేసినా బీజేపీని గెలిపించాల్సిన బాధ్యత కూడా టీడీపీదే ! కనుక ఎందుకనో తెలుగు రాష్ట్రాలపై మోడీ కానీ ఇతర వర్గాలు కానీ ప్రేమ పెంచుకోవడం వల్ల వచ్చే ఫలితాలే ఏవీ లేవని తేలిపోయింది. అయితే ఏపీలో టీడీపీ తో బీజేపీ జట్టు కట్టబోదని తెలుస్తోంది. జనసేనతో వెళ్తే బాగుంటుంది అన్న ఆలోచనతోనే రాజకీయం చేస్తోంది. ఆఖరి నిమిషంలో టీడీపీతో బంధాలు బలపడినా ఆశ్చర్య పోనవసరం లేదు కానీ అవన్నీ కాస్త ఊహలకు సంబంధించిన ప్రతిపాదనలే !
ఇక ప్రధాని రాక నేపథ్యంలో చాలా పరిణామాలు మారిపోనున్నాయి అని అనుకోలేం. ఎందుకుంటే బీజేపీకి చాలా చోట్ల వీర సైనికులు ఎవ్వరూ లేరు. కార్యకర్తలు కనీస స్థాయిలో కూడా లేరు. మోడీ కూడా ఓ ప్రయత్నంలో భాగంగానే ఎన్నికల ప్రచారం నిర్వహించడం కానీ లేదా దక్షిణాది నేతలకు తగు ప్రాధాన్యం ఇవ్వడం కానీ చే స్తున్నారు. జనసేనతో వెళ్లే అవకాశాలున్నా ఎక్కువ సీట్లు బీజేపీ తెచ్చుకోలేదు. ఒంటరి పోరు అస్సలు స రిపోదు.
అందుకే ఈ సమయాన మోడీ, షా ద్వయం కేవలం జాతీయ సమావేశాలకే తమని తాము పరిమితం చేసుకోక కొన్ని స్థానాలలో అయినా ఆశించిన ఫలితాలు అందుకోవా లని పరితపిస్తున్నారు. తెలంగాణలో హంగ్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి. కానీ ఆంధ్రాకు ఆ సీన్ లేదు. ఒకవేళ అలాంటివి ఏమయినా జరిగితే వాటిని ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహం చేయాలి అన్న దానిపై పార్టీ శ్రేణుల్లో చర్చలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో ఇమేజ్ ఉన్న లీడర్లను బీజేపీ కనుక ఆకర్షించగలిగితే మంచి ఫలితాలే వస్తాయి. అయితే ఇక్కడ బండి సంజయ్ స్థానంలో కేసీఆర్ పై సమర్థనీయ స్థితిలో పోరాటం చేసే నాయకుడి నియామకం అన్నది తప్పనిసరి!