జీహెచ్ ఎంసీ పీఠం: ఎక్స్ ఆఫీషియో టీఆర్ ఎస్ కు వరమా?

Update: 2020-11-18 11:29 GMT
జీహెచ్ఎంసీ పీఠంపై కన్నేసిన టీఆర్ఎస్ పక్కా ప్లాన్ తో ముందుకెళుతున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ మాస్టార్ మైండ్ ఇక్కడ పనిచేస్తోందని అంటున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ పీఠం టీఆర్ఎస్ కు దక్కేలా కేసీఆర్ చక్రం తిప్పారని అంటున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 150 వార్డులు ఉన్నాయి.  నగరి పరిధిలో మొత్తం 52 ఎక్స్ అఫిషియో ఓట్లు ఉన్నాయి.  ఈ రెండు కలిపితే మొత్తం సంఖ్య 202. కాబట్టి మేయర్ పీఠం దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 101 స్థానాలను సాధించాల్సి ఉంటుంది. ఒక రకంగా పరోక్షంగా మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఎక్స్ అఫిషియో ఓట్లు ఉపయోగపడుతాయి.

గ్రేటర్ పరిధిలో 52 ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నాయి. ఇందులో టీఆర్ ఎస్ కు 38 - ఎంఐఎంకు 10 - బీజేపీకి 3 - కాంగ్రెస్ కు 1 ఉన్నాయి. గ్రేటర్ పీఠాన్ని ఈ ఓట్లే నిర్ధేశిస్తాయి. అయితే ఇది అధికార పార్టీకి కలిసి వచ్చే అంశంగా మారింది. మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే టీఆర్ఎస్ కేవలం 64 స్థానాల్లో విజయం సాధిస్తే సరిపోతుందన్న మాట.. తక్కువ స్థానాలు వచ్చినా ఎంఐఎంకు ఎలాగూ 10 ఎక్స్ ఆఫీషియో ఓట్లతోపాటు కార్పొరేట్ సీట్లు వస్తాయి.దీంతో టీఆర్ఎస్ కు ఖచ్చితంగా ఈ లెక్కలతో మేయర్ పీఠం ఖాయమని.. జీహెచ్ ఎంసీ టీఆర్ఎస్ దేనని అంటున్నారు.

ఎన్నికల్లో ఒకవేళ టీఆర్ఎస్ అంచనాలు తలకిందులైనా టీఆర్ఎస్ దే గెలుపు ఖాయం అని.. కేసీఆర్ అందుకే పక్కా వ్యూహంతోనే ఈ స్కెచ్ గీశాడని చెబుతున్నారు.
Tags:    

Similar News