రిషి కొండ‌లో ఏం జరుగుతోంది?

Update: 2022-07-01 23:30 GMT
ప‌ర్యాట‌కంగా రిషి కొండ ప‌రిస‌ర ప్రాంతాల‌ను అభివృద్ధి చేద్దాం అన్న ఆలోచ‌నలో భాగంగా వైసీపీ స‌ర్కారు ఇక్క‌డ అప్ప‌టిదాకా ఉన్న నిర్మాణాల‌న్నింటినీ కూల్చి పారేసింది. ఆ నిర్మాణాలు బాగున్నా కూడా ఎందుక‌నో కూల్చింది. పోనీ కొత్త క‌ట్ట‌డాల‌యినా వేగంగా చేప‌ట్టిందా అంటే అదీ లేదు.  బీచ్ ఒడ్డున టూరిజం ను డెవ‌ల‌ప్ చేయాల‌న్న ఆలోచ‌న‌కు, ఇప్పుడు చేప‌డుతున్న నిర్మాణాల‌కు అస్స‌లు పొంత‌నే లేదు.

కొత్త నిర్మాణాల‌కు సంబంధించి నిబంధ‌న‌లు అనేకం అడ్డుగా  ఉన్నాయి. కానీ వాటిని వినిపించుకోకుండా మ‌ట్టి త‌వ్వ‌కాలు యథేచ్ఛ‌గా సాగించి కాసులు పిండుకున్న అధికార పార్టీనాయకులు ఇప్పుడు అవే త‌వ్వ‌కాలు చేసిన చోట నిర్మాణాల పేరిట పునాదులు త‌వ్వ‌డంతో టీడీపీ అభ్యంత‌రం చెబుతోంది. కనీసం సుప్రీం అనుమ‌తులూ లేవు, భవన నిర్మాణాల‌కు జీవీఎంసీ అనుమతులూ లేవు..

ప్లాన్ అప్రూవ‌ల్ తీసుకోకుండానే జీవీఎంసీ  నుంచి ఎటువంటి సానుకూల సంకేతాలు లేకుండానే కొండ చుట్టూ నిర్మాణాలు సాగిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరే విధంగా వివాదాస్ప‌ద ప్ర‌దేశాల్లో నిర్మాణాల‌కు పునాదులు తీస్తున్నారు.

అదేవిధంగా భ‌వ‌నాల డిజైనర్ల‌కే  75 కోట్లు చెల్లించేందుకు టెండ‌ర్లు పిలిచిన దాఖలాలు ఉన్నాయ‌ని ప్ర‌ధాన మీడియాం అంటోంది. వీటిపై  కూడా సాయిరెడ్డి స్పందిస్తే మిగిలిన విష యాల్లో వై సీపీ స్ప‌ష్ట‌త ఏంట‌న్న‌ది తేల‌నుంద‌ని టీడీపీ మండిప‌డుతోంది.

సుప్రీం కోర్టు ఆదేశాలు అనుసారం రిషికొండ చుట్టూ త‌వ్వ‌కాలు జ‌ర‌గ‌డం లేద‌న్న వాదన ఉంది.విశాఖ కేంద్రంగా జ‌రుగుతున్న త‌వ్వ‌కాల‌పై ఇప్ప‌టికే  సుప్రీం కొన్ని స్ప‌ష్ట‌మ‌యిన మార్గ‌ద‌ర్శ‌కాలు ఇచ్చినా కూడా అవి మాత్రం సంబంధిత నాయ‌కులకు కానీ అధికారుల‌కు కానీ ప‌ట్ట‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లే వ‌స్తున్నాయి.

సుప్రీం కోర్టు తీర్పున‌కు వ్య‌తిరేకంగా ప‌నులు జ‌రుగుతున్నా అవేవీ ప‌ట్టించుకోని దాఖ‌లాలే లేని కార‌ణంగా య‌థేచ్ఛ‌గా నిర్మాణాలు సాగిపోతున్నాయి. గ‌తంలో ఉన్న భ‌వనాలు కూల్చి కొత్త‌వి కడ‌తామ‌ని చెప్పిన వైసీపీ సర్కారు ఇప్పుడు అలాంటివేవీ చేప‌ట్ట‌కుండానే కొత్త నిర్మాణాల‌కు కొండ‌ను త‌వ్వి చ‌దును చేసిన ప్రాంతాన్ని ఎంచుకోవ‌డంతో వివాదాలు పెరిగిపోతున్నాయి. రిషికొండ వ‌ద్ద కొత్త‌గా తవ్వి చ‌దును చేసిన చోట నిర్మాణాలు చేప‌ట్ట‌కూడద‌ని సుప్రీం నిబంధ‌న‌లు ఉన్నా అవేవీ అమ‌ల్లోకి రావ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లున్నాయి.
Tags:    

Similar News