కేసీఆర్ ను మించిన వ్యూహకర్త లేరు, బాగుంది ఈ మాట. జగన్ ను మించిన వ్యూహకర్త లేరు.. ఈ మాట కూడా అంటే బాగుండు. కానీ ఎవ్వరూ అనడం లేదు. కానీ గుడివాడ మాత్రం పొత్తుల్లేవ్ అని తేల్చేరు. కానీ పీకే మాత్రం ఉంటాయి అని పరోక్ష సంకేతాలు ఇచ్చి పంపుతున్నారు. ఇంకా చెప్పాలంటే పీకే వేరు ఆయన పీఏ వేరు అన్న విధంగా ప్రశాంత్ కిశోర్ వేరు, ఆయన నడిపే ఐ ప్యాక్ సంస్థ వేరు అని మాట్లాడుతున్న కేటీఆర్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి ఓ సారి.
ఆ విధంగా అయినా తెలుగు రాష్ట్రాల రాజకీయాలను అర్థం చేసుకునే ప్రయత్నం ఒకటి చేయాలి..ఇన్ని జరుగుతున్నాయి కదా ! వైసీపీ కూడా ఓ జాగృతి లాంటి కల్చరల్ వింగ్ ఏర్పాటు చేసుకుంటే ఎంత బాగుండు.. తెలంగాణ జాగృతి మాదిరిగానే వెరీ నెక్ట్స్ పొలిటికల్ పార్టీగా రూపాంతరం చెందితే ఇంకెంత బాగుండు. అయినా కేసీఆర్ మాత్రం ఎంతకాలం తెలంగాణ రాష్ట్ర సమితిని నిర్వహిస్తారు. జస్ట్ ఫర్ ఎ ఛేంజ్ .. కొత్త పార్టీ ఒకటి పెట్టి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే.. అప్పుడు టైటిల్ మార్చుకోవాలి..అందుకే ఆయన ఆలోచనలు కూడా మారిపోతున్నాయి అని తెలుస్తోంది.
వరుస పరిణామాలతో తెలుగు రాష్ట్రాల రాజకీయం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వరుస పరిణామాలతో తెలుగు రాష్ట్రాలలో ఓ మార్పు రావాలన్న సంకేతాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఓ స్థాయికి చేరుకునేందుకు, పూర్వ వైభవం అవుదుకునేందుకు చాలా అంటే చాలానే ఆశపడుతోంది. అట్టడుగున ఉన్న ఆ పార్టీ త్వరలో పునరుత్థాన రీతికి చేరుకోనుంది.
ఆ విధంగా జరిగితే అధినేత్రి సోనియా ఆశలు పండినట్లే, ఆమె నోములు కూడా పండినట్లే ! అందుకు తగ్గ వ్యూహం ప్రశాంత్ కిశోర్ ది .. ఆయన తన వైపుగా చాలా పనులు చేయనున్నారు. ఒకటి జగన్ ను మైత్రికి ఒప్పించడం, రెండు కేసీఆర్ ను ఒప్పించి తెలంగాణ రాష్ట్ర సమితిని విలీనం చేయించడం..ఇవి ప్రస్తుతానికి ఊహాగానాలు. వీటిలో కొన్నే జరుగుతాయి..మిగిలినవి జరగని పనులు..అయితేనేం తెలుగు రాష్ట్రాల మీడియాకు కావాల్సినంత వార్తల పండగ.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఓ వైపు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మరోవైపు దేశ రాజకీయాలను ప్రభావితం చేయాలని ఉవ్విళ్లూరుతున్నాయా? లేదా తన అన్న ( పెద్దన్న అని రాయాలి..) కేసీఆర్ బాటలోనే జగన్ ముందస్తుకు సిద్ధం అవుతున్నారా ? ఈ రెండు తెలుగు పరిణామాలనూ ఓ సారి అవలోకిద్దాం.
ఆ విధంగా తెలంగాణలో ఏదో జరుగుతుంది అన్న మాటకు విరుద్ధంగా ఏం జరుగుతుంది అన్నది తేల్చుకుందాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి ప్రశాంత్ కిశోర్ ఎంట్రీ ఇస్తే రాజకీయ పరిణామాలు మారుతాయి. ఎవరు ఏం అనుకున్నా ఆయన తన పాత దోస్తులను ఇటుగా తెప్పించేందుకే ఎక్కువ ప్రయత్నం చేయనున్నారు. ఆ విధంగా ఆయన కొంతలో కొంత సఫలీకృతం అయితే మార్పులన్నవి అనూహ్యం కావడం ఖాయం.