మినిస్టర్ రోజా విశాఖలో ఏం చేయబోతున్నారంటే...?

Update: 2022-04-22 05:28 GMT
ఆమె ఇపుడు మినిస్టర్ రోజా. ఆమె ఇంతకాలం ఎమ్మెల్యేగానే ఉన్నారు. దానికి ముందు అగ్ర నటీమణిగా కూడా రాణించారు. ఆ సమయంలో ఆమె విశాఖకు ఎన్నో సార్లు వచ్చారు. అయితే తొలిసారిగా రోజా విశాఖ మినిస్టర్ హోదాలో వస్తున్నారు. ఈ నెల 23న ఆమె విశాఖ టూర్ పెట్టున్నారు. టూరిజం మినిస్టర్ గా టూరిస్ట్ స్పాట్ విశాఖకు ఆమె రానున్నారు. ఏపీలో టూరిజం అంటే అంతా విశాఖ వైపు చూస్తారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎన్నో అందమైన ప్రదేశాలు, ఆధ్యాత్మిక, చారిత్రాత్మకమైన ప్రదేశాలు ఉన్నాయి.
 
దాంతో రోజా తన కార్యక్షేత్రంగా మొదటిగా విశాఖనే ఎంచుకున్నారు. విశాఖ జిల్లాతొ  పాటు అనకాపాల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో ఆమె పర్యటించనున్నారు. ఈ సందర్భంగా టూరిజానికి సంబంధించిన ప్రాజెక్టుల పురోగతి మీద కూదా ఆమె సమీక్ష జరపనున్నారు. అలాగే  విశాఖ సిటీతో పాటు ఏజెన్సీలోనూ రోజా పర్యటిస్తారని, పర్యాటక ప్రదేశాలను ఆమె స్వయంగా పరిశీలిస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

స్మార్ట్ సిటీగా టూరిజం హబ్ గా గుర్తింపు పొందిన విశాఖను మరింతగా అభివృద్ద్ధి చేయాలన్నది రోజా ఆలోచనగా చెబుతున్నారు. నిజానికి విశాఖ టూ భీమిలీ వరకూ టూరిజం అనేక ప్రాజెక్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించారు.

అయితే నిధుల కొరత కారణంగానే అవి కాగితాల మీదనే ఉండిపోయాయని అంటున్నారు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ కింద విశాఖ సహా ఏపీలోని అనేక కీలకమైన ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్ళాలని అనుకున్నారు. విశాఖలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో నాడు మీటింగుని కూడా నిర్వహించారు. అయితే అది కూడా ఆశించిన స్పందన రాక ఆగిపోయింది.

మొత్తానికి విశాఖ సహా ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాలు అందాలకు పుట్టినిళ్ళు. మరి వాటిని మరింతగా అభివృద్ధి చేయాలనుకుంటే నిధుల సమస్య వస్తోంది. పీపీపీ విధానంలో అడుగులు ముందుకు వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడితే బాగుంటుంది. ఆ దిశగా కొత్త మంత్రి రోజా ఏమైనా దూకుడుగా చర్యలు తీసుకుంటారేమో చూడాలి. మొత్తానికి రోజా విశాఖ టూర్ కోసం టూరిజం అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సిటీ ఆఫ్ డెస్ట‌నీ కూడా న్యూ మినిస్టర్ కోసం వెయిట్ చేస్తోంది.
Tags:    

Similar News