రోజు రోజుకు విస్తరించుకుంటూ దేశంలోనే నెహ్రు, ఇందిరా తర్వాత ప్రధానిగా ఉంటూ మ్యాజిక్ ఫిగర్ మించిన సీట్లతో విజయం సాధించిన మోడీ విజయం వెనుక ఆయన ఛరిష్మాతో పాటు మోడీ - షా ద్వయం వ్యూహారచనా ఉంది.. ఒకప్పుడు 2 సీట్లున్న బిజెపిని కేంద్రంలో అధికారం చేపట్టే స్థాయికి తీసుకెళ్లడంలో వాజ్ పేయి - అద్వానీల కృషిని కాదనలేం.. కానీ అప్పటికీ బిజెపి హింది రాష్ట్రాలకే పరిమితమైన పార్టీగా ఉండేది.. ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల- ఒడిసా- దక్షిణాది లో ఆ పార్టీ కి సరైన ప్రాతినిధ్యమే ఉండేది కాదు... కానీ 2014లో మోడీ పగ్గాలు చేపట్టాకా.. అమిత్ షా నేతృత్వంలో బిజెపి ఎప్పుడూ అధికారం చూడని రాష్ట్రాల్లోనూ అధికారం దక్కించుకొంది.. అసలు వీళ్లకు సీనే లేదనే రాష్ట్రాల్లో కొన్ని ఎంపీ సీట్లు గెలుచుకోవడం ద్వారా సత్తా చాటింది...
ప్రధానంగా త్రిపుర లాంటి లెప్ట్ డామినేటేడ్ రాష్ట్రంలో కంచుకోటను బద్దలు కొట్టి పవర్ లోకి వచ్చిన బిజెపి అస్సాం లాంటి రాష్ట్రాల్లోనూ పాగా వేయగలిగింది... అలాగే తాజా ఫలితాల్లో బెంగాల్ 39 శాతం ఓటుతో ఏకంగా 18 స్థానాలు గెలుచుకొని అధికార పార్టీ తృణమూల్ తో పాటు పటిష్టమైన క్యాడర్ ఉన్న లెప్ట్ పార్టీలకు సవాల్ విసిరింది, ఈశాన్య రాష్ట్రాల్లో తన హవా ప్రదర్శించింది.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్- ఛత్తీస్ ఘడ్- మధ్య ప్రదేశ్ లోనూ 65 ఎంపీ స్థానాలుగాను 62 గెలుచుకున్నారు.. ఏపీ, తమిళనాడు, కేరళలో మాత్రమే ఈ సారి ఎన్నికల్లో బిజెపి కి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.. చాలా రాష్ట్రాల్లో ఎంపీ ల సంఖ్య గెలుచుకున్నప్పటికీ బిజెపి బలాన్ని సుస్థిరం చేసే దిశగా కొత్త ప్లాన్ కు తెరలేపారు మోడీ - షా ప్రధానంగా బీహార్ లో సమాజ్ వాదీ పార్టీ, బీహార్ లో ఆర్జేడీ లాంటి పార్టీలకు ప్రధాన బలం యాదవులే.. అందుకే వారికి పోటీగా ఈ సారి ఎక్కువ మంది ఓబీసీ, ఎంబీసీ అభ్యర్థులకు అవకాశం ఇచ్చి విజయం సాధించారు బిజెపి నేతలు.. అలాగే ఆయా రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఒక సామాజికవర్గం బలంతో ఎదిగిన నేతలు , పార్టీలకు ధీటుగా బీసీ కార్డు లేదా ఓబీసీ కార్డు తీసుకొచ్చి.. ఆయా వర్గాల్లో నేతలకు టిక్కెట్లిచ్చి మెజార్టీ సీట్లు గెలుచుకొంది.. క్యాబినెట్ ఏర్పాటులోనూ ఎప్పుడూ లేనంతగా దాదాపు 34 మంది వరకు బీసీ- ఓబీసీ- ఎంబీసీ కులాలకు ప్రాతినిధ్యం కల్పించి.. కొత్త వ్యూహానికి తెరలేపింది బిజెపి.. రాబోతున్న రాష్ట్రాల ఎన్నికలు.. ఎంపీ సీట్లు గెలుచుకున్న రాష్ట్రాల్లో పూర్తి స్థాయి పట్టు సాధించడమే లక్ష్యంగా ఈ కొత్త వ్యూహానికి కమలనాథులు తెరలేపారంటున్నారు.