ఎన్టీఆర్ కుటుంబం రియాక్షన్ ఏంటి?

Update: 2022-09-21 08:30 GMT
వైసీపీ ప్ర‌భుత్వం తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యంపై.. అన్ని వ‌ర్గాల నుంచి తీవ్ర వ్య‌తిర‌క‌త వ‌స్తోంది. విజ‌య‌వాడ‌లోని ప్ర‌ఖ్యాత ఎన్టీఆర్ యూనివ‌ర్సిటీ ఆరోగ్య వైద్య విశ్వ‌విద్యాల‌యం పేరును డాక్ట‌ర్ వైఎస్సార్ వైద్య ఆరోగ్య విశ్వ విద్యాల‌యంగా పేరు మార్చాల‌ని.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీంతో ఈ విష‌యం.. రాష్ట్ర వ్యాప్తంగా దావాల‌నంలా మారి.. రాజ‌కీయ మంట‌లు రేగుతున్నాయి. పార్టీల‌కు అతీతంగా కూడా నాయ‌కులు ముందుకు వ‌స్తున్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీని ఇప్ప‌టికీ విమ‌ర్శిస్తున్న‌ బీజేపీ నాయ‌కులు కూడా దీనిని త‌ప్పుబ‌ట్టారు.

ఇక‌, వైసీపీ మెరుగు అంటూ.. ఆ పార్టీకి మ‌ద్ద‌తు తెలిపిన‌.. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా.. వైసీపీ స‌ర్కారు  నిర్ణ యాన్ని త‌ప్పుబ‌డుతున్నారు. ఎన్టీఆర్ వ‌ర్సిటీకి.. అన్న‌గారి పేరునే కొన‌సాగించాల‌ని.. జిల్లాకు ఆయ‌న పేరు పెట్టి.. వ‌ర్సిటీకి ఆయ‌న పేరు తీసేయ‌డం దారుణ‌మని వ్యాఖ్యానించారు. ఇక‌, ఇత‌ర పార్టీల నాయ‌కులు కూడా వైసీపీ స‌ర్కారు నిర్ణ‌యాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇదిలావుంటే.. ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబం ఎలా రియాక్ట్ అవుతుంది? అనేది ఆస‌క్తిగా మారింది.

ముఖ్యంగా ఎన్టీఆర్ కుమారుడు.. బాల‌య్య‌, కుమార్తె పురందేశ్వ‌రిలు.. రాజ‌కీయాల్లో యాక్టివ్ గాఉన్నారు. బాల‌య్య‌ప్ర‌స్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా పురందేశ్వ‌రి.. బీజేపీలో కీల‌క నాయ‌కురాలిగా.. జాతీయ‌స్థాయి ప‌ద‌విలో ఉన్నారు. గ‌తంలో ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు చేసిన‌ప్పుడు పురందేశ్వ‌రి సంతోషం వ్య‌క్తం చేశారు. ఇక‌, బాల‌య్య కూడా.. బాగానే ఉంద‌న్నారు. మ‌రి ఇప్పుడు ఈ ఇద్ద‌రు నాయ‌కులు.. ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు.

ఎన్టీఆర్ వ‌ర్సిటీ పేరును మార్చుతున్న‌ట్టు వార్త‌లు రాగానే.. అన్న‌గారి అభిమానులు.. పెద్ద ఎత్తున ఆవేద న‌తో నిండిపోయారు. ఇక‌, టీడీపీ నేత‌లు.. ఆందోళ‌న‌కు కూడా దిగారు. చంద్ర‌బాబు ఫైర‌య్యారు. బిల్లు ను వెన‌క్కి తీసుకోక‌పోతే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మాల‌కు కూడా.. సిద్ధ‌మ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. మ‌రి ఇంత జ‌రుగుతున్నా.. ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు..ఎలాంటి ఖండ‌నా.. ప్ర‌క‌ట‌న రాలేదు. మ‌రి ఎప్ప‌టికి స్పందిస్తారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News