ప‌వ‌న్ ఏపీ ప‌ర్య‌ట‌నకు -సీఎం జ‌గ‌న్‌తో లింక్ ఏంటి ?

Update: 2023-05-15 14:02 GMT
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీలో అనూహ్యంగా క‌నిపించారు. వ‌రుస‌గా రెండు రోజులు ఆయన ఏపీలోనే ఉన్నారు. నిజానికి దాదాపు మూడు మాసాలుగా ఆయ‌న ఏపీలో క‌నిపించ‌లేదు. మూడు నెల‌ల కింద‌ట‌.. వారాహి వాహ‌నానికి ప్ర‌త్యేక పూజ‌లు చేయించేందుకు ఆయ‌న విజ‌య‌వాడ వ‌చ్చారు. త‌ర్వాత‌.. ఎక్క‌డా క‌నిపించ‌లేదు. అంతేకాదు..వారాహినిలైన్‌లో పెడతానని.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తాన‌ని చెప్పారు.

కానీ, వారాహికి పూజ‌లు చేసిన అనంత‌రం ప‌వ‌న్ ద‌ర్శ‌నం క‌రువైంది. అదేస‌మ‌యంలో ఆయ‌న మ‌హారా ష్ట్ర‌లో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నార‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది. దీంతో మూడు మాసాల పాటు ప‌వ‌న్ ద‌ర్శ‌నాలు ఏపీలో లేకుండా పోయాయి. అప్పుడప్పుడు.. ఆయ‌న సోద‌రుడు నాగ‌బాబు మాత్రం రావ‌డం.. చిన్నా చిత‌కా మీటింగులు నిర్వ‌హించ‌డం తెలిసిందే.

అయితే.. అనూహ్యంగా రెండు రోజుల పాటు ఏపీలోనే ప‌వ‌న్ మ‌కాం వేయ‌డం చ‌ర్చ‌కు దారితీసింది. ఈ నెల 11, 12న రెండు రోజులు కూడా ప‌వ‌న్ ఏపీలోనే ఉన్నారు. అంతేకాదు.. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న పెద్ద‌గా ప్ర‌స్తావించ‌ని.. పొత్తుల అంశాన్ని ప్ర‌ధానంగా తెర‌మీదికి తెచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తులు ఉంటాయ‌ని.. తాము టీడీపీ-బీజేపీ క‌లిసే ఎన్నిక‌ల‌కు వెళ్తామ‌ని చెప్పారు.

కానీ, ఇది ఉరుములు లేని పిడుగు లాంటి వార్త‌. పైగా.. ప‌వ‌న్ ఇప్ప‌టికిప్పుడు.. రాష్ట్రంలో ఉన్న పరిస్థితు ల‌కు భిన్నంగా పొత్తుల గురించి ప్ర‌స్తావించ‌డం.. మేధావి  వ‌ర్గాన్ని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. దీంతో తెర‌వెనుక ఏం జ‌రిగింద‌నే విష‌యంపై తీగ లాగారు.

ఈ క్ర‌మంలో రాష్ట్రంలో సీఎం జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కాన్ని ప్రారంభించారు. దాదాపు 100 సంవ‌త్స‌రాల‌కు పైగా ఎటూ తేలకుండా ఉన్న చుక్క‌ల భూముల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించి.. రైతుల‌కు ఆభూముల‌పై హ‌క్కులు క‌ల్పించారు.

ఈ నేప‌థ్యంలో ఈ ప‌థ‌కం క‌నుక ప్ర‌జ‌ల్లోకి వెళ్తే..త మ‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని.. భావించిన జ‌న‌సేన‌.. చాలా వ్యూహాత్మకంగా ఈ ప‌థ‌కంపై పెద్ద‌గా చ‌ర్చ జ‌ర‌గ‌కూడ‌ద‌న్న కోణంలోనే ఇలా హఠాత్తుగా.. సంచ‌ల‌న వ్య‌వ‌హారాన్ని తెర‌మీదికి తెచ్చింద‌ని.. త‌ద్వారా.. వైసీపీ కి మైలేజీ రాకుండా చేయాల‌నే వ్యూహం దాగి ఉంద‌ని మేధావులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇది వాస్త‌వంలోనూ నిజం కావ‌డం గ‌మ‌నార్హం.

Similar News