టీడీపీ, జ‌న‌సేన‌ల మ‌ధ్య ప్యాకేజీ ఎంత‌?

Update: 2021-12-14 08:30 GMT
రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌రు. అదేవిధంగా.. ఇప్పుడు.. టీడీపీతో ప్ర‌శ్నించే పార్టీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. త్వ‌ర‌లోనే మిత్ర‌త్వం చేసుకునే అవ‌కాశం మెండుగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి ఒంట‌రిగా పోటీ చేయ‌డం అల‌వాటు లేని చాలా పార్టీలు చేస్తున్న ప‌ని ఇదే. వైసీపీని గ‌ద్దె దించేయాలి.. తాము అధికారంలోకి వ‌చ్చేయాలి.. అనే ధోర‌ణితో.. వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌న‌సేన నాయ‌కుడు కూడా.. త‌నకు న‌చ్చిన మార్గంలో ప్యాకేజీలు తీసుకుని స‌హ‌క‌రిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.  

ఇటీవ‌ల‌.. విశాఖ ఉక్క ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకం అంటూ.. కొన్ని గంట‌ల పాటు దీక్ష చేసిన జ‌న‌సేన అధినే త ప‌వ‌న్ క‌ళ్యాణ్.. అనంత‌రం సుదీర్ఘంగా ప్ర‌సంగించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న చేసిన కొన్ని వ్యాఖ్య‌లు.. ఇప్పుడు రాజ‌కీయ విశ్లేష‌కుల మ‌ధ్య చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఈ నేప‌థ్యంలోనే ``టీడీపీ, జ‌న‌సేన‌ల మ‌ధ్య ప్యాకేజీ ఎంత‌?`` అనే చ‌ర్చ ఆస‌క్తిగా మారింది. తాజాగా ప‌వ‌న్ సంభాష‌ణ‌, మాట‌తీరును గ‌మ‌నిస్తే.. ఆయ‌న పూర్తిగా మారిపోయిన‌ట్టు క‌నిపిస్తున్నాడని ప‌రిశీల‌కులు అంట‌న్నారు.

ఇప్పుడు ప‌వ‌న్ ఒక్క‌టే ఆలోచ‌న చేస్తున్నాడ‌ని.. ఆయ‌న మ‌న‌సులో అదే ఉంద‌ని అంటున్నారు. అదేం టంటే.. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని ఎలాగైనా గ‌ద్దె దించ‌డం. వైసీపీ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేకత వ‌చ్చే లా చేసి.. ప‌క్క‌న పెట్టడం. అయితే.. దీనికిగాను ప‌వ‌న్‌కు సొంత బ‌లం పెద్ద‌గా స‌రిపోవ‌డం లేద‌ని అంటు న్నారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్‌.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అయిన‌ప్ప‌టికీ.. వైసీపీని ఓడించ లేక పోతున్నారు. వాస్త‌వానికి క్షేత్ర‌స్థాయిలో బ‌లాన్ని చూస్తే.. టీడీపీ ముందు బీజేపీ తేలి పోతోంది.

అయిన‌ప్ప‌టికీ.. ఇక్క‌డి బీజేపీతో ప‌వ‌న్ పొత్తు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇక‌, కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌తోనూ మ‌రి రెపో మెయింటెన్ చేస్తున్నాడు ప‌వ‌న్‌. ఇదిలావుంటే, రాష్ట్ర బీజేపీ నాయ‌కుల ఆశ‌, శ్వాస ఎలా ఉంద‌నేది.. అంద‌రికీ తెలిసిందే. క్షేత్ర‌స్థాయిలో బ‌లం లేకున్నా.. అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా .. నాయ‌కులు అడుగులు వేస్తున్నారు. అతిగా ఊహించుకుని గెలిచేస్తాం.. అంటూ ప్ర‌తిజ్ఞ‌లు చేస్తున్నారు. ఈ ప‌రిణామం.. జ‌న‌సేన‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఎంత మాత్రం బ‌లం లేకున్నా.. ఈ ప్ర‌క‌ట‌న‌లు ఎందుకు? అనే ఆలోచ‌న చేస్తున్నారు.

మ‌రోవైపు.. క్షేత్ర‌స్థాయిలో బ‌లం ఉన్న టీడీపీతో క‌లిసిపోతే.. బెట‌ర్ అని భావిస్తున్నారు. అయితే.. ఈక్ర‌మం లో స‌యోధ్య చేసే నాయ‌కుడు కావాలి. ఇదే విష‌యాన్ని జ‌న‌సేన ఊడా కోరుకుంటోంది. అదే కాకుండా.. ఆర్థింగా కూడా మ‌ద్ద‌తు కూడా అవ‌స‌ర‌మ‌ని జ‌న‌సేన నేత‌లు భావిస్తున్నార‌ని తెలుస్తోంది. అంటే.. టీడీపీ-జ‌నసేన‌లు క‌ల‌వాల‌ని భావిస్తున్నాయ‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. కానీ. బీజేపీ కూడా జ‌న‌సేన‌తోనే ఉండాల‌ని భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో జన‌సేన‌తో టీడీపీ స‌యోధ్య కుద‌రాల‌ని చూస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్‌.. ఇటీవ‌ల కాలంలో టీడీపీని ఏమీ అనకుండా.. వైసీపీనే టార్గెట్ చేస్తున్నారు.  సైలెంట్‌గా ఎన్నిక‌ల స‌మ‌యానికి సీట్లు, ఆర్థికం ప్యాకేజీలు చూసుకుంటున్నార‌నే టాక్ వినిపిస్తోంది. సో.. మొత్తానికి బీజేపీ .. టీడీపీల‌తో క‌లిసి.. ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హరించే అవ‌కాశం ఉన్నందునే.. ఆయ‌న‌కు టీడీపీ నుంచి ప్యాకేజీ ఎంత సెట్ అయింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. 
Tags:    

Similar News