స్థానిక సంస్థల ఎన్నికలను హఠాత్తుగా ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా పరిణామాలు మారాయి. అప్పటి దాక ఎన్నికల వాతావరణం వేడిగా ఉండగా ఆ ప్రకటనతో అందరూ షాక్ కు గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా విచక్షణ అధికారాలు పేరిట కరోనా వైరస్ వ్యాప్తి అనే సాకుతో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికలను వాయిదా వేస్తూ తీసుకున్న ఆకస్మిక నిర్ణయాన్ని ప్రజలతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖండించింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రకటించాక వాయిదా పడడం దాదాపు ఎక్కడ లేవు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ పరిణామం జరగడంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా పరిగణించారు.
ఎన్నికలను వాయిదా వేయడంపై రాజ్యాంగం లో ఉన్న ప్రధాన స్వతంత్ర సంస్థను, ఆ సంస్థ అధిపతిని నేరుగా దూషించకూడదు. కానీ ఒక ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై ముప్పేట దాడి చేస్తుండగా ఆయన స్పందించకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందిస్తున్నారు. జగన్ చేస్తున్న ఆరోపణలను నిజం చేసేలా టీడీపీ వైఖరి కనిపిస్తోంది. ఎన్నికలు వాయిదా వేస్తున్నప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘం కమిషనర్ గా ఉన్న రమేశ్ కుమార్ తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శలకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేదా ఎన్నికల సంఘం స్పందించాల్సి ఉంది. కానీ అందుకు విరుద్ధంగా.. భిన్నంగా టీడీపీ నాయకులు ఆ విమర్శలను తిప్పి కొడుతున్నారు. పైగా రమేశ్ కుమార్ ను వెనకేసుకొస్తున్నారు. తమ పార్టీ నాయకుడిని విమర్శించిన మాదిరి అధికార పార్టీ పై ప్రతిదాడి చేస్తున్నారు.
దీన్ని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించినట్టు చంద్రబాబు, రమేశ్ కుమార్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయని, చంద్రబాబు కోసమే ఎన్నికలు వాయిదా వేశారని చేసిన ఆరోపణలు వాస్తవమేనని ప్రజలు గ్రహిస్తున్నారు. అందుకే రమేశ్ కుమార్ ను విమర్శిస్తే వారిపై టీడీపీ నాయకులు విమర్శలు చేస్తూ వాటిని ఖండిస్తున్నారు. అంటే రమేశ్ కుమార్ ను తమ పార్టీ అధికార ప్రతినిధిగా భావిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. వారి మధ్య అనుబంధం వాస్తవం కాకపోతే ఎందుకు విమర్శిస్తున్నారని సోషల్ మీడియా తో పాటు బహిరంగంగా నెటిజన్లు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు, హైకోర్టులో కేసులు వేస్తే చంద్రబాబుతో పాటు ఆయన పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయడం, విమర్శలు చేయడం ఏమిటని సందేహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం, మంత్రులు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను టార్గెట్ చేస్తే ఆయన సమాధానం చెప్పాల్సి ఉండగా టీడీపీ కార్యాలయం నుంచి టీడీపీ అధికార ప్రతినిధుల నుంచి స్పందన వస్తోంది. ఏ లెక్కన నిమ్మగడ్డ తరఫున టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారని సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇది వారి మధ్య బంధాన్ని బహిర్గతం చేస్తోందని, చంద్రబాబు కోసమే ఎన్నికలు వాయిదా వేసినట్లు స్పష్టమవుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు.