తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా రంగంలోకి దిగారు స్వామి పరిపూర్ణానంద. స్వామి పరిపూర్ణానందది కాకినాడ అయినా.. ఆయనకు రెండు రాష్ట్రాల్లోనూ భక్తులు ఉన్నారు. ఇక స్వామి పరిపూర్ణానంద నిర్వహిస్తున్న భారత్ టుడే చానెల్ హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వీటన్నింటికి తోడు.. హైదరాబాద్ నుంచి బహిష్కణ అయిన నేపథ్యంలో.. తెలంగాణలోనే తన సత్తా చూపించాలని అనుకున్నారు స్వామి పరిపూర్ణానంద. అందుకు బీజేపీలో చేరి.. ఎన్నికల్లో బాగానే కష్టపడ్డారు. కానీ ఫలితం మాత్రం రాలేదు. ఆ తర్వాత ఆయన ఎక్కడా కన్పించింది లేదు.
తెలంగాణలో ఇప్పట్లో ఎన్నికలు లేవు. ఇక మిగిలింది ఏపీలోనే. ఏపీలో కూడా బీజేపీ ప్రస్తుతానికి ఒంటరిగానే పోటీ చేస్తుంది. మరి ఇలాంటి టైమ్ లో స్వామి పరిపూర్ణానంద ఏపీ నుంచి రంగంలోకి దిగుతారంటూ వార్తలు విన్పిస్తున్నాయి. ఏపీ నుంచి రంగంలోకి దిగడమే కాకుండా.. ప్రచారం కూడా చేస్తారంటూ సమాచారం. ఇంకా చెప్పాలంటే స్వామి పరిపూర్ణానందకి తెలంగాణలో కంటే ఏపీలోనే భక్తులు ఎక్కువ. దీంతో.. స్వామిపై భక్తులకు ఉన్న నమ్మకాన్ని ఉపయోగించుకుంటూ ఎన్నికల బరిలోకి దిగాలని ప్లాన్ చేస్తోంది బీజేపీ. మరి బీజేపీ ప్లాన్ కనీసం ఆంధ్రాలో అయినా వర్కవుట్ అవుతుందా.? అన్నింటికి మించి ఏపీ ఎన్నికల బరిలో దిగేందుకు స్వామికి పరిపూర్ణానందుకు ఆసక్తి ఉందో లేదో..? ఇంకొన్నిరోజుల్లోనే తేలిపోనుంది.