వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కేబినెట్లో చేరుతుందనే ఊహాగానాలు పవన్ కల్యాణ్ వీరాభిమానులను ఉక్కిరిబిక్కరి చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ వాళ్లు జగన్ ను పిలిచి మరీ పదవులు ఇస్తే అప్పుడు పవన్ కల్యాణ్ పరిస్థితి ఏమిటనేది చర్చనీయాంశంగా మారుతూ ఉంది. ఇటీవలే పవన్ కల్యాణ్ వెళ్లి బీజేపీకి దగ్గరైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పవనే చాలా ఆసక్తిగా ఢిల్లీకి వెళ్లారు. ఒకటికి రెండు సార్లు ఢిల్లీ పర్యటన చేశారు. అయితే కనీసం అమిత్ షాను కానీ, మోడీని కానీ కలవలేకపోయారు. చివరకు ఏదో నిర్మలా సీతారామన్ ను కలిసి చేతులుదులుపుకున్నారు పవన్. అంతటితో తనే వీర హిందుత్వవాదిగా మారిపోయారు పీకే. అంత వరకూ కమ్యూనిస్టులతో దోస్తీ చేసి, ఎన్నికల సమయంలో బీజేపీని విమర్శించి.. పీకే చివరకు బీజేపీ సన్నిహితుడు అయిపోయాడు.
అయితే ఇప్పుడు ఉన్నట్టుండి వైఎస్ జగన్ కు మోడీ అపాయింట్ మెంట్ కుదిరింది. ఇదే జనసేన కు నచ్చే అంశం కాదు. ఇక మోడీ కేబినెట్లోకి వైసీపీ చేరితే అప్పుడు పవన్ కల్యాణ్ కు మరింత అసహనం కలగవచ్చు.
రీజనేమో కానీ... రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పవన్ కల్యాణ్ కు జగన్ అంటే అస్సలు పడటం లేదు. తను జగన్ ను ముఖ్యమంత్రిగా గుర్తించనంటూ పవన్ కల్యాణ్ అహంకారపు మాటలకు కూడా వెనుకాడలేదు. పవన్ గుర్తించకపోయినా జగన్ కు వచ్చిన నష్టం ఏమీ లేదు. మోడీ గుర్తిస్తూ ఉన్నాడు. అదే పవన్ కల్యాణ్ కు మింగుడుపడే అంశం కాకపోవచ్చు.
ఇక పవన్ కల్యాణ్ తో పొత్తు తర్వాత కూడా ఏపీలో బీజేపీ గ్రాఫులు ఏమీ పెరగలేదు. పవన్ కల్యాణ్ కు పార్టీ నడపడం చేతగాక బీజేపీతో చేతులు కలిపాడనే అభిప్రాయాలే సర్వత్రా వినిపిస్తూ ఉన్నాయి. దీంతోనే పవన్ ను బీజేపీ అధిష్టానం కూడా లైట్ తీసుకుందని టాక్. కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేక పోవడం పవన్ కల్యాణ్ ను బీజేపీ వాళ్లు పూర్తిగా లైట్ తీసుకోవడానికి మరో కారణం కావొచ్చు. అలాగే చంద్రబాబు అనుకూల వాదిగా పవన్ పై ముద్ర పడింది. దీంతో పవన్ ను లైట్ తీసుకుని.. జగన్ పార్టీకి ఇప్పుడు మోడీ కేంద్రమంత్రి పదవులు ఖరారు చేస్తుండవచ్చనే టాక్ వినిపిస్తూ ఉంది.
ఏదేమైనా.. వైసీపీని బీజేపీ వాళ్లు కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటే మాత్రం..జనసేనకు, పవన్ కల్యాణ్ కు అంత కన్నా ఝలక్ ఉండక పోవచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో!