ఆదర్శాలు నోటి మాటలుగా.. మూణ్నాళ్ల ముచ్చటగా మారిపోతున్నాయి. దీంతో.. మాటల్లో వినిపించే కమిట్ మెంట్.. చేతల్లో కనిపించని పరిస్థితి. ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంతగా తగ్గించాలంటూ మంత్రి కేటీఆర్ తరచూ చెబుతుంటారు. అదే పనిగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు వినియోగించే బదులుగా గ్లాసుల వినియోగం.. కాపర్ బాటిల్స్ ను వినియోగించాలని.. ఆఫీసుల్లో ప్లాస్టిక్ వినియోగానని తగ్గించాలని చెప్పేవారు.
తాజాగా ధరణి వెబ్ పోర్టల్ కోసం చేపట్టిన కంట్రోల్ రూంను సందర్శించినప్పుడు కనిపించిన సీన్ చూస్తే.. నోట మాట రాదంతే. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సోమేశ్ కుమార్.. కంట్రోల్ రూంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకున్నారు. ఆయన వెంట అధికారులు.. కెమేరా మెన్లను తీసుకొచ్చారు. ఈ సందర్భం గా అక్కడ పని చేస్తున్న ఐటీ ఉద్యోగుల తో మాట్లాడారు. ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి? ధరణి వెబ్ పోర్టల్ పని తీరు పై పలు ప్రశ్నలు అడిగారు.
పోర్టల్ ను లాంఛ్ చేసిన దాని తో పోల్చినప్పుడు పరిస్థితి మెరుగుపడిందన్న మాట వారి నోట వినిపించింది. ఈ సందర్భంగా అక్కడ పని చేస్తున్న నిపుణుల టీం టేబుల్ చూస్తే.. మంత్రి కేటీఆర్ మాట ఎక్కడా చెల్లుబాటు కావటం లేదన్న విషయం ఇట్టే అర్థంకాక మానదు. ఎందుకంటే..ఒక టేబుల్ మీద ఆరు ల్యాప్ టాప్ లు ఉంటే.. టేబుల్ మీద పదమూడు వాటర్ బాటిల్స్ ఉండటం చూస్తే.. రోజువారీగా వినియోగించే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఏ స్థాయిలో ఉంటాయన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నిత్యం ప్లాస్టిక్.. వాడొద్దు.. వాడొద్దు అనే బదులు.. ప్రభుత్వ కార్యాలయాల్లో.. ప్రభుత్వం పని చేసే చోట వీలైనంత తక్కువగా ప్లాస్టిక్ వినియోగించేలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది కదా? ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ కానీ.. ప్రధానకార్యదర్శి సోమేశ్ కానీ గుర్తిస్తున్నారా?