రాహుల్ కు బీజేపీకి వ‌చ్చే సీట్ల లెక్క చెప్పిన బాబు?

Update: 2019-05-18 11:41 GMT
ఆస‌క్తిక‌ర విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇటీవ‌ల కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు భేటీ కావ‌టం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఒక రిపోర్ట్ ను రాహుల్ కు ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. అందులో బీజేపీ గెలుచుకునే సీట్ల లెక్క ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ రిపోర్ట్ ను కాంగ్రెస్ అధినేత ఆస‌క్తిగా చూసిన‌ట్లుగా చెబుతున్నారు.

విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం రాహుల్ కు ఇచ్చిన బాబు రిపోర్ట్ లో.. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీకి వ‌చ్చిన సీట్ల‌తో పోలిస్తే దాదాపు వంద‌కు పైగా సీట్లు త‌గ్గ‌టం ఖాయ‌మ‌ని తేల్చారు. అంతేకాదు.. ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీగా బీజేపీ నిలుస్తుంద‌ని.. అయితే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లు బీజేపీకి ద‌క్క‌వ‌ని పేర్కొన్న‌ట్లు చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూట‌మి స‌ర్కార్  కానీ.. ఆ పార్టీ మ‌ద్ద‌తుతో ప్రాంతీయ పార్టీల కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు చెప్పిన‌ట్లు తెలిసింది. బీజేపీకి వ‌చ్చే సీట్ల‌తో పోలిస్తే.. యాభై స్థానాలు మాత్ర‌మే కాంగ్రెస్ కు త‌క్కువ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. ఆ సీట్ల‌ను మిగిలిన ప్రాంతీయ పార్టీల‌కు వ‌చ్చే సీట్ల‌తో స‌ర్దుబాటు చేసుకోవాల్సి ఉన్న‌ట్లుగా చెప్పిన‌ట్లుగా స‌మాచారం. మ‌రి.. బాబు ఇచ్చిన రిపోర్ట్ ఎంత‌వ‌ర‌కూ నిజ‌మ‌న్న‌ది ఫ‌లితాలు వెల్ల‌డైతే కానీ క్లారిటీ రాద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News