తాజాగా ముంబైలో కొన్ని ప్రముఖ జాతీయ చానెళ్లు టీఆర్పీ రేటింగ్ ల కోసం వినియోగదారులకు రూ.500 చెల్లించి మరీ తమ చానెల్ చూసేలా ప్రలోభ పెట్టడం.. కొన్ని మీటర్లు పెట్టి మరీ టీఆర్పీ స్కాం చేయడాన్ని ముంబై పోలీసులు రట్టు చేశారు. ఇప్పటివరకు ఇలా మూడు చానళ్లు చేశాయని ఆరోపణలు వస్తున్నాయి.
జాతీయ చానెల్ రిపబ్లికన్ టీవీ పేరు బయటపెట్టిన పోలీసులు అది టీఆర్పీ సిస్టమ్ ను టాంపరింగ్ చేసిందని చెబుతున్నారు. అయితే రిపబ్లికన్ టీవీ ఈ ఆరోపణలను ఖండిస్తోంది.
ఈ క్రమంలోనే ఇప్పటివరకు ప్రేక్షకులకు తెలియని ఒక కొత్త పదం కొద్దిరోజులుగా అందరి మదిని తొలిచేస్తోంది. అసలు ఈ టీఆర్పీ అంటే ఏమిటి? దీనికోసం ఎందుకు టీవీ చానెళ్లు ఇలా చేస్తాయనే దానిపై బోలెడు డౌట్లు ఉన్నాయి.
*టీఆర్పీ అంటే ఏంటంటే?
టీఆర్పీ అంటే ‘టెలివిజన్ రేటింగ్ పాయింట్స్’. ఇది ఒక ప్రత్యేకమైన టూల్. దీని ద్వారా ఏ కార్యక్రమాన్ని ఏ చానెల్ ను జనాలు ఎక్కువగా చూస్తున్నారో అంచనా వేయవచ్చు. వీటితో ప్రజల ఇష్టాలను తెలుసుకోవడానికి వీలవుతుంది. దీన్ని బట్టి కంపెనీలు ఆయా చానెల్స్ కు, టీవీ కార్యక్రమాలకు ప్రకటనలు ఇస్తుంటాయి. ఏజెన్సీలకు ఈ టీఆర్పీతోనే ప్రయోజనం కలుగుతుంది. ఏ కార్యక్రమాన్ని జనాలు ఎక్కువగా చూస్తున్నారో ఈ రేటింగ్స్ బట్టి తెలుస్తుంది.
* 2008లో టీవీ రేటింగ్స్ ను ట్రాయ్ ఏర్పాటు
ప్రకటనలు ఇచ్చేవారికి తమ డబ్బుకు తగిన పూర్తి ప్రయోజనం లభించేలా రేటింగ్ వ్యవస్థను ట్రాయ్ ఏర్పాటు చేసింది. ఇదే ‘బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్)’ ఇదే టెలివిజన్, చానెళ్ల నంబర్ 1 ర్యాంకును నిర్ధారిస్తున్నాయి. దీన్ని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ సిఫారసు చేస్తోంది.
టీవీలో జనాలు దేన్ని ఎక్కువగా చూస్తున్నారో ఒక ప్రత్యేక మీటర్ ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతానికి దేశంలో 44వేల ఇళ్ల నుంచి టీవీ కార్యక్రమాల డేటా సేకరిస్తున్నారు. రెస్టారెంట్లు , షాపుల్లో మొత్తం శాంపిల్ సైజ్ గా సేకరిస్తారు.
దేశంలో 130 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 19.5 కోట్లకు పైగా టెలివిజన్ సెట్లు ఉన్నాయి. అందుకే ప్రజల వరకు చేరడానికి కంపెనీల కోసం ఈ టీఆర్పీలు చాలా కీలకంగా మారాయి. ఫిక్కీ రిపోర్ట్ ప్రకారం 2016లో భారత్ లో ప్రకటనల వల్ల టీవీ చానెళ్లకు ఏకంగా 243 బిలియన్ల ఆదాయం లభించింది. 2020కి 368 బిలియన్లకు పెరిగింది.