కొత్త ఏడాది అంటే కొత్త ఆశలు ఉంటాయి. గత ఏడాది జరగనివి కొత్త ఏడాదిలో సాకారం అవుతాయన్న ఊహలు ఉంటాయి. అదే సమయంలో కొత్త ఏడాదిలో బోలెడు మార్పులు వస్తాయని అవన్నీ తమకే అనుకూలంగా మారుతాయని ఎవరికి వారు వ్యక్తిగతంగా అనుకోవడం సహజం. అదే విధంగా రాజకీయ పార్టీలు అలాంటి ఆశలే పెట్టుకుంటాయి. ఇక విపక్షంలో ఉన్న పార్టీలు అయితే కొత్త ఏడాది పూర్తిగా తమకు కలసిరావాలని కోటి దేవుళ్లకు మొక్కుకుంటూ ఉంటాయి.
తెలుగు సంవత్సరాదికి మామూలుగా పండితులు పంచాంగం చదివి వినిపిస్తారు. ఎవరి గ్రహ స్థితులు ఏమిటి అన్నది చక్కగా చెప్పేస్తారు. మరి ఆంగ్ల సంవత్సరానికి మాత్రం రాజకీయ పార్టీల నేతలే పండితులుగా మారి జాతకాలు చెబుతున్నారు. ఈ విషయంలో టీడీపీ ముందుంటే బీజేపీ ఆ తరువాత స్థానంలో ఉంది. మిగిలిన పార్టీలూ అదే రూట్లో సాగుతున్నాయి.
ఇంతకీ టీడీపీ కొత్త ఏడాది 2022ని ఎలా ఊహించుకుంటోంది అంటే ఏదో విధంగా మ్యాజిక్ జరిగైనా తమకు అధికారం దక్కుతుందేమో అని అంటున్నారు. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కింజరాపు అచ్చెన్నాయుడు అయితే ఎపుడైనా ఏపీలో ఎన్నికలు జరుగుతాయి అనేశారు. ఎన్నికల కోసం ఇప్పటి నుంచే క్యాడర్ రెడీగా ఉండాలని కూడా ఆయన పిలుపు ఇచ్చారు. ఇక ఎన్నికలు ఎపుడు జరిగినా వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తుందని జోస్యం చెప్పేశారు. అంటే దారుణమైన రిజల్ట్స్ అన్న మాట.
ఒక విధంగా టీడీపీ ఏపీలో ముందస్తు ఎన్నికలను ఊహిస్తోంది అంటున్నారు. మరి ఎందుకు అలా జరుగుతుంది అంటే వారికే తెలియాలి కానీ 2022 మీద బాగానే హోప్స్ పెట్టుకుంది అంటున్నారు. అచ్చెన్నాయుడు మాటల బట్టి చూస్తూంటే ముందస్తు తధాస్తూ అని టీడీపీ అనుకుంటూ 2022లోకి అడుగుపెడుతోంది.
ఇక బీజేపీ విషయానికి వస్తే ఏపీలో ఎన్నో రాజకీయ పరిణామాలు కొత్త ఏడాది జరుగుతాయని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అంటున్నారు. అవేంటి అంటే జగన్ మీద కేసులు ఉన్నాయట. రాజకీయ నేతల మీద కేసులు తొందరగా కొలిక్కి తేవాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నందువల్ల దాని మీద తీర్పులు వస్తాయని ఆయన ఊహిస్తున్నారు.
ఇక అది కాకపోయినా ఏపీలో జగన్ నవరత్నాలను సరిగ్గా కొనసాగించలేరని, ఆర్ధిక ఇబ్బందుల వల్ల చేతులెత్తేస్తారని కూడా ఆయన అంటున్నారు. ఇక ఎపుడు ఎన్నికలు జరిగినా వైసీపీకి 15 సీట్ల కంటే ఎక్కువ రావు అనేస్తున్నారు రాజు గారు. మరో వైపు ఏపీలో అన్ని వర్గాలు ప్రస్తుత ప్రభుత్వం మీద గుర్రుగా ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున ఆందోళను జరుగుతాయని బీజేపీ సహా ఇతర రాజకీయ పక్షాలు ఆశిస్తున్నాయి.
మరి నిజంగా ఏపీలో పొలిటికల్ గా అలా జరుగుతుందా ఏదో విధంగా రెండున్నరేళ్లుగా నెట్టుకువచ్చిన జగన్ 2022లో అన్ని రకాలైన సమస్యలు తోసుకువచ్చి కార్నర్ అవుతారా అంటే చూడాలి మరి. మొత్తానికి 2022లో ఏపీలో తీవ్రమైన రాజకీయ పరిణామాలు జరుగుతాయనే పార్టీలతో పాటు రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి.మరి చూడాలి ఏం జరుగుతుందో.