ఎన్నికల షెడ్యూల్ వచ్చేంత వరకూ.. ఎప్పుడెప్పుడా అని పార్టీలు, రాజకీయ ఆసక్తి ఉన్న వాళ్లు ఎదురుచూశారు. అయితే ఎన్నికల షెడ్యూల్ రాగానే మాత్రం.. అప్పుడేనా! అనేది చర్చనీయాంశం అవుతోంది. గత కొన్ని పర్యాయాల్లో ఎన్నడూ లేని రీతిలో ఈ సారి ఏపీలో ఎన్నికలు మొదటి దశలోనే జరగబోతూ ఉన్నాయి. ఉమ్మడి ఏపీలో కూడా ఎన్నికలు ఇలా తొలివిడతలోనే జరిగిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు మాత్రం ఏపీ, తెలంగాణల్లో ఒకే విడతలో, అది కూడా మొదటి దశలోనే ఎన్నికలు అయిపోబోతున్నాయి.
సరిగ్గా నేటికి నెల రోజుల్లో ఏపీలో పోలింగ్ జరగాల్సి ఉంది. అంతకు మించిన విచిత్రం ఏమిటంటే.. మరో వారం రోజుల్లో నామినేషన్ల దాఖలు చేయాల్సి ఉంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీలు కసరత్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే వారం రోజుల్లో అభ్యర్థులను ప్రకటించే స్థాయిలో పార్టీలు కసరత్తు చేశాయా? అనేది మాత్రం సందేహమే!
ఇప్పటి వరకూ రాజకీయ పరిణామాలను గమనిస్తే.. ఉన్నట్టుండి వచ్చినట్టుగా అనిపిస్తున్న ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ప్రిపేర్ అయ్యిందా? అనేది సందేహంగానే కనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి తెలుగుదేశం విషయంలోనే ఈ సందేహాలు రావడానికి కొన్ని కారణాలున్నాయి. అందుకు ప్రధాన కారణం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న సమీక్షలు!
ఇప్పటి వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారికంగా అభ్యర్థులను ప్రకటించలేదు. జాబితాను ఏదీ విడుదల చేయలేదు. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ సూటిగా స్పష్టంగా కనిపిస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. ఒకరికి మించిన స్థాయిలో ఇన్ చార్జిలను పెట్టి.. ‘మీ ఇద్దరిలో ఎవరో ఒకరికి.. ‘ అనే రీతిలో జగన్ రాజకీయం చేయడం లేదు. వైసీపీ అభ్యర్థుల విషయంలో ఇలాంటి రచ్చలు పెద్దగా లేవు. ఉన్నా కొన్ని నియోజకవర్గాల విషయంలో మాత్రమే! ఇది వైసీపీ పరిస్థితి.
అదే తెలుగుదేశం విషయానికి వస్తే బాబు ఎడాపెడా చేయించిన ఫిరాయింపులు, పార్టీ ఐదేళ్లుగా అధికారంలో ఉండటంతో బాగా సంపాదించిన వాళ్లు, సిట్టింగుల మధ్యన టికెట్ల విషయంలో పోరాటం సాగుతూ ఉంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో విబేధాలు రచ్చకు ఎక్కాయి.
ఇక చంద్రబాబు నాయుడు అయినా వాటిని చకచకా పరిష్కరించారా..? అంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు. బాబు చేస్తున్న సమీక్షల్లో ఏమీ తేల్చలేకపోతున్నారు. పైగా కొత్త గందరగోళాలు తలెత్తాయి. టికెట్ ఖరారే.. అని కొన్ని పేర్లు ప్రకటించినా.. వాటిపై అధికారిక నిర్ణయం లేదని.. చంద్రబాబు నాయుడు లీకులు మాత్రమే ఇచ్చారనే మాట వినిపిస్తూ ఉంది!
ఇప్పటి వరకూ అభ్యర్థులు ఖరారు అయిపోయారనే సీట్ల విషయంలో కూడా బాబు మళ్లీ సమీక్షలు నిర్వహిస్తూ ఉండటం ప్రహసనంగా మారింది. ఇలాంటి నేపథ్యంలో వారం రోజుల్లో చంద్రబాబు నాయుడు ఎలాంటి స్పష్టతలు ఇవ్వబోతున్నారు. అందుకు పర్యవసనాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.
ఇక జనసేన విషయానికి వస్తే.. ఆ పార్టీ ఇప్పటి వరకూ ప్రిపేర్ అయ్యింది ఏమీ లేదు. ఎక్కడా అభ్యర్థుల విషయంలో క్లారిటీ లేదు. ఇలాంటి నేపథ్యంలో.. ఇన్ని రోజులూ ఏం చేయలేని పార్టీ.. ఈ వారం రోజుల్లో ఏం చేస్తుంది? ఎన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తుంది? అనేది అంతుబట్టని వ్యవహారం ఏమీ కాదు. ఇక కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులపై పెద్ద అంచనాలు ఏమీ లేవు. ప్రధాన పోటీ టీడీపీ, వైఎస్సార్సీపీ ల మధ్య మాత్రమే ఉంటుంది.వీటిల్లో జగన్ పార్టీలోనే అభ్యర్థుల విషయంలో చాలా వరకూ స్పష్టత కనిపిస్తోంది. వారం రోజుల్లో రాజకీయంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.