మంగళగిరిపై సర్వే రిపోర్ట్.. వాట్సాప్ లో హల్చల్!

Update: 2019-04-09 05:26 GMT
ఒకవైపు వాట్సాప్ లో ఒక సర్వే హల్ చల్ చేస్తూ ఉంది. దాని ప్రకారం.. ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి లోకేష్ మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి కనీసం నాలుగు వేల ఓట్ల పై స్థాయిలో లీడింగ్ లో ఉన్నారు! కులాల వారీగా చాలా డీటెయిల్డ్ గా ఉన్న ఆ సర్వే ప్రకారం.. ఆర్కే విజయం సాధిస్తారు! లోకేష్ దాదాపు నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోతారని అందులో పేర్కొన్నారు.

అయితే అది ఎంత వరకూ నిజం? అనేది తర్వాతి సంగతి. ప్రస్తుతానికి అయితే వైరల్ గా మారింది. దీంతో మంగళగిరి మళ్లీ హాట్ టాపిక్ గా మారింది.

లోకేష్ కచ్చితంగా గెలిచే పరిస్థితి లేకపోతే చంద్రబాబు నాయుడు ఆయనను అక్కడ పోటీ చేయించే వారే కాదు.. అనేది విస్తృతంగా వినిపిస్తున్న మాట! బాబు వివిధ సర్వేలు చేయించుకున్నాకే మంగళగిరి నుంచి లోకేష్ ను పోటీకి దించి ఉండవచ్చు. రాజధాని ప్రాంతం కావడంతో అక్కడ రియలెస్టేట్ బూమ్ ఉండటంతో లోకేష్ కు అక్కడ తిరుగు ఉండదు అని బాబు భావించి ఉండవచ్చు.

అందులోనూ చంద్రబాబు నాయుడు తనయుడు కాబట్టి.. ఆయన ఎమ్మెల్యేగా ఉంటే ఆ నియోజకవర్గంలో డెవలప్ మెంట్ జరగవచ్చు అనే ఆశలు ప్రజల్లో కలిగే అవకాశం ఉంది. అది లోకేష్ కు మరో ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలూ ఉంటాయి.

తెలుగుదేశం అంటే అభిమానం లేకపోయినా.. ఒక పార్టీ అధినేత తనయుడు అక్కడ పోటీలో ఉంటే ప్రయోజనకరం అనుకునే వాళ్లుంటారు  కదా. వాళ్లే లోకేష్ ను రక్షించాల్సి ఉంటుంది.

అయితే స్థానికంగా పద్మశాలీలు అత్యధికంగా ఉన్నారు. వారికి సంబంధించిన నేతలు తమ పార్టీలో ఉన్నప్పుడు బాబు అక్కడ సర్వేలు చేయించుకున్నారని - అంతా అనుకూలంగా కనిపించిందని - లోకేష్ కు టికెట్ ఖరారు అయ్యాకా వారంతా దూరం కావడంతో తేడా కొడుతూ ఉందనే విశ్లేషణలూ వినిపిస్తూ ఉన్నాయి!

మొత్తానికి ఏం జరుగుతుందో కానీ.. మంగళగిరి ఫలితంపై హాట్ డిస్కషన్ కొనసాగుతూ ఉన్నాయి. దీనిపై బెట్టింగులు కూడా బాగానే జరుగుతూ ఉన్నాయి!




Tags:    

Similar News