‘సాక్షి’లో ఏం జరుగుతోంది? సలహాదార సంస్థలే దెబ్బతీస్తున్నాయా!

Update: 2019-11-02 09:42 GMT
సాధారణంగా ఒక బిజినెస్ లో సక్సెస్ కోసం కన్సల్టెంట్స్ ను నియమించుకుంటూ ఉంటాయి పెద్ద పెద్ద సంస్థలు కూడా. అయితే ఆ కన్సల్టెంట్లకు సదరు వ్యాపారం మీద, అందులోని ఎత్తుపల్లాల మీద బాగా అవగాహన-నైపుణ్యం ఉండి ఉండాలనేది ప్రాథమికమైన అంశం. అయితే ‘సాక్షి’ పత్రిక వ్యవహారంలో కన్సల్టెంట్ల పాత్ర గురించి జర్నలిస్టులు విస్తుపోతూ ఉన్నారు. ఆ సంస్థ వ్యవహారాలు-మార్కెటింగ్- యాడ్స్ విషయాల్లో వివిధ కన్సెల్టెంట్ల పాత్ర అయోమయం గందరగోళం అన్నట్టుగా ఉండటం గమనార్హం.

ముందుగా ఒక ప్రఖ్యాత ఫైనాన్షియల్ కన్సల్టెంట్ తో సాక్షికి ఒప్పందం ఉంది. కామెడీ ఏమిటంటే.. అది ఆర్థిక సంబంధం వ్యవహారాల సంస్థ. దానికీ మీడియాకూ ఏ మాత్రం సంబంధం లేదు. అది పేరున్న సంస్థే. అయితే దానికీ జర్నలిజానికీ వీసవెత్తు సంబంధం లేదు!

అది సాక్షి విధానాలను పటిష్టపరచడానికో, సంస్థాగతమైన వ్యవహారాలను చూడటానికో పని కొస్తుందా అంటే అది కూడా లేదు. సాక్షి డైరెక్టర్లలో ఒకరిగా ఉన్న ఒక పంజాబీ మహిళ ఆ సంస్థతో ఒప్పందాన్ని కుదర్చిందట. దానికి గానూ ప్రతి నెలా లక్షల రూపాయలు ఆ సంస్థకు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆ సంస్థకు ఒప్పందాన్ని కుదర్చడంతో పాటు, ఎలాంటి లాభం లేకపోయినా ఆ ఒప్పందం కొనసాగడంతో ఆమెదే కీలక పాత్ర అని తెలుస్తోంది. ఈ విషయంపై యాజమాన్యం కళ్లు గప్పుతోందట సదరు మహిళా డైరెక్టర్.

సాక్షి హెడ్ ను కలవడానికి ముందు ఆ కన్సల్టెంట్ ఉద్యోగులకు ఆ హెడ్ విధులు- బాధ్యతలు తెలియదు. అసలు న్యూస్పేపర్ లో ఎన్ని విభాగాలు ఉంటాయి, ఆవిభాగాలు ఏం చేస్తాయని కనీసఅవగాహన లేదు. దినపత్రికకుకీలకమైనది ఎడిటోరియల్. అసలుఎడిటోరియల్ అంటే ఏమిటో తెలియదుఆ కన్సల్టెంట్ సిబ్బందికి.

వార్త అంటే ఏమిటన్నదానితోమెదలవుతుంది వారి సంభాషణ. సాక్షిఎడిటోరియల్ టీమ్ ఇప్పుడువిస్తుపోతోంది. అసలు వార్త అంటేతెలియని ఆ కన్సల్టెంట్ ఉద్యోగులకు లక్షల రూపాయలు ఎందుకు అని?

మీకు ఏం తెలియనప్పుడు మా గురించిఏం నివేదిక ఇస్తారని ఓ హెడ్ అడిగితేఏమో సార్ ఆఫీసులో చెప్పారు వచ్చాముఅంతకు మించి ఏమీ తెలియదని.

రిపోర్టింగ్ అంటే ఏమిటి? డెస్క్ ఏంచేస్తుంది? సబ్ ఎడిటర్ తరువాతఎడిటర్ ఉంటారా? రిపోర్టర్ అంటే ఏంచేస్తారు? బిజినెస్ పేజీలో ఏం రాస్తారు? అవి రాయాలంటే అర్హతలు ఏమిటి? వార్తఎక్కడి నుంచి తెస్తారు? వార్త రాశాక ఏంచేస్తారు? స్టోరీ అంటే ఏమిటి? స్పెషల్స్టోరీ అంటే ఏమిటి? స్పాట్ అంటే? ఇలాంటి ప్రశ్నలు. ఇవేవో సాక్షి ఉద్యోగులకుక్విజ్ అనుకునేరు.. ఆ కన్సల్టెంట్ఉద్యోగులకు కనీస పరిజ్ఞానం లేకపోవడంవల్ల.

ఒక్క ఎడిటోరియల్ మాత్రమే కాదు, అన్నివిభాగాల పరిస్థితి అదే. దేనిమీద కనీసజ్ఞానం లేదు. మరి ఆ సంస్థ ఏం నివేదికఇస్తుంది? సాక్షి ఉద్యోగులకు వేతనాలుపెంచడానికి ఉత్సాహం చూపరు కానీఇలాంటి పనికిరాని పనులు చేయటానికిలక్షలు వృధా చేయటానికి మనసెలావస్తుందో!

మరో గొప్ప విషయం చెప్పుకోవాలి. అదేమిటో తెలిస్తే మరింత విస్తుపోతారు. అడ్వర్టైజ్ మెంట్ అండ్ మార్కెటింగ్ లోతెలుగు పత్రికల్లో సాక్షి దిఅగ్రస్థానం. అలాంటి యాడ్స్ విభాగం ఇప్పటివరకూయాజమాన్యం నిర్దేశించిన లక్ష్యాలుసాధిస్తూ వచ్చింది.

అలాంటి విభాగానికి సలహాలు ఇవ్వడానికిటైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి ఓవ్యక్తి సలహాలు ఇవ్వడానికి నెలకు రూ.20 లక్షలు చెల్లిస్తుంది యాజమాన్యం. ఏమైనాప్రయోజనం ఉందంటే నిల్. పైగా వారి సలహాలతో పని లేదనియాజమాన్యానికి యాడ్స్ విభాగం చెప్పినా వినలేదట. ఇదంత ఏడాది క్రితం సీఈవోగా చేరిన వ్యక్తిపని.

ఈ అంశాలు మీడియా సర్కిల్ లో ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి.
Tags:    

Similar News