రాహుల్ గాంధీ ఏ బ్యాంకుకు వెళ్లినా అప్పు పుట్టడం లేదట.. కనీసం సెల్ ఫోన్ దుకాణానికి వెళ్లి సిమ్ కార్డు అడిగినా కూడా ఎవరూ ఇవ్వడం లేదట. అదేంటి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినంత మాత్రాన అంత పెద్ద మనిషిని అలా వెలివేస్తే ఎలా అనుకోవద్దు. ఈ రాహుల్ గాంధీ ఆ రాహుల్ గాంధీ కాదు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన రాహుల్ గాంధీ కాదీయన. సోనియా - రాజీవ్ ల కుమారుడు కాదు ఈయన. అసలు ఈయన ఉండేది దిల్లీలోనే కాదు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో. కానీ... ఈయనకు బ్యాంకులలో లోను దొరక్కపోవడానికి, సెల్ ఫోన్ సంస్థలు సిమ్ కార్డులివ్వకపోవడానికి కారణం మాత్రం అసలు రాహుల్ గాంధీయేనట. ఆయన పేరు ఈయన పేరు ఒకటే అయినా మనిషి వేరు కావడంతో మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడన్న అనుమానంతో ఏదో ఒక కారణంతో ఆయనకు లోన్లు ఇవ్వడం లేదట.
కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం - రాజీవ్ గాంధీ అంటే ఇష్టంతో ఇండోర్ లోని అఖండ్ నగర్ కు చెందిన ఓ కుటుంబం తమ కుమారుడికి రాహుల్ గాంధీ అని పేరు పెట్టుకుంది. ఆ పేరే అతని పాలిట శాపమయ్యింది. దాంతో ఈ యువకుడికి బ్యాంకులు రుణం ఇవ్వడానికి ముందుకు రాకపోవడమే కాక ఒక్క టెలికాం కంపెనీ కూడా అతని పేరు మీద సిమ్ ఇవ్వడానికి అంగీకరించలేదట.
‘లోన్ కోసం ఓ సారి బ్యాంక్ కు వెళ్లాను. నా పేరు రాహుల్ గాంధీ అని చెప్పాను. దాంతో ఆ బ్యాంక్ అధికారి నవ్వుతూ.. రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి ఇండోర్ ఎప్పుడు షిప్ట్ అయ్యారని ప్రశ్నించాడు. నిజంగానే నా పేరు రాహుల్ గాంధీ అని చెప్పినా అతడు వినిపించుకోలేదు. పైగా నకిలీ పత్రాలతో మోసం చేయాలనుకుంటున్నావా అని ప్రశ్నించాడు. చివరకు సిమ్ కార్డులు కూడా ఇవ్వడం లేదు. నా ఐడెంటిటీ కార్డులు చూపించినా వాటిని నమ్మడం లేదు.
ఇక లాభం లేదని.. ఇలా అయితే సమాజంలో బతకలేనని పేరు మార్చుకున్నాడా కుర్రాడు. పేరు చివర ఉన్న గాంధీని తీసేసి మాలవీయ అని పెట్టుకున్నాడు. తమ సామాజిక వర్గంలో మాలవియా అనే పేరు చాలా కామన్ కాబట్టి దాన్ని తన పేరుకు యాడ్ చేసుకున్నానని చెప్పాడు. మరి.. ఇప్పుడు రాహుల్ గాంధీ రాహుల్ మాలవీయ అయిన తరువాతయినా ఆయన కష్టాలు తీరుతాయో లేదో చూడాలి.