సిద్దిపేటకు హరీశ్ అంత చేస్తున్నప్పుడు.. హైదరాబాద్ కు కేటీఆర్ ఎందుకు చేయరు?
సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు చేపట్టిన ఆటో డ్రైవర్ల సహకార పరపతి సంఘం మోడల్ ఇప్పుడు పెద్ద చర్చకు తెర తీసింది. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో హరీశ్ తెర మీదకు తెచ్చిన సరికొత్త విధానాన్ని.. కాబోయే ముఖ్యమంత్రిగా చెబుతున్న మంత్రి కేటీఆర్ ఎందుకు ఫాలో కారన్నది చర్చగా మారింది. ఆటోడ్రైవర్ల కోసం మంత్రి హరీశ్ అంత చేస్తున్నప్పుడు.. రాష్ట్రంలో అత్యధిక ఆటోలు ఉన్న హైదరాబాద్ మహానగరంలోని వారి పరిస్థితి ఏమిటి? అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న.
గ్రేటర్ బాధ్యతల్ని తీసుకున్న మంత్రి కేటీఆర్.. మరెవరినీ వేలు పెట్టనివ్వరన్నది తెలిసిందే. అలాంటప్పుడు.. సిద్దిపేట మోడల్ ను స్ఫూర్తిగా తీసుకొని కేటీఆర్.. హైదరాబాద్ లో ఈ విధానాన్ని ఏర్పాటు చేస్తే.. వేలాది ఆటోవాలాలకు కొత్త ఊరడింపును ఇచ్చినట్లు అవుతుంది. ఆటో డ్రైవర్లు తాము సంపాదించేదంతా కిస్తీలు కట్టేందుకు సరిపోతున్న పరిస్థితుల్లో.. ఆ వడ్డీ బాధల్ని తప్పించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన పరపతి సంఘానికి రివాల్వింగ్ ఫండ్ గా.. మంత్రి హరీశ్ తన ఇంటి కాగితాల్ని తాకట్టు పెట్టి రూ.45లక్షల మొత్తాన్ని ఇవ్వటం తెలిసిందే.
హరీశ్ మాదిరే.. మంత్రి కేటీఆర్ సైతం ఇలాంటి పరపతి సంఘాన్ని ఏర్పాటు చేయటం ద్వారా పేద వర్గాలకు అండగా నిలవటంతోపాటు.. రాష్ట్రానికి కొత్త స్ఫూర్తిని ఇచ్చినట్లు అవుతుందన్నది మర్చిపోకూడదు. మంత్రిగా ఉన్న హరీశే అంత చేసినప్పుడు.. త్వరలో ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని స్వీకరించనున్న కేటీఆర్ మరెంత చేయాలంటారా?