తన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే మాజీ మంత్రి కమ్ ఎంపీ శశిథరూర్ తాజాగా ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తనకు ఒక సినిమాలో పాత్రను పోషించేందుకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆఫర్ ఇచ్చినట్లుగా వెల్లడించారు.
సోషల్ మీడియా స్టార్ జానిస్ సీక్వెరాతో మాట్లాడిన సందర్భంగా ఆయనీ వివరాలు వెల్లడించారు. కండల వీరుడు సల్మాన్ నటిస్తున్న ఒక మూవీలో తనకో చిన్న పాత్రను ఆఫర్ చేసినట్లు చెప్పారు. ఒక సీన్ లో భారత విదేశాంగ మంత్రిగా తనను కనిపించాలని కోరారన్నారు. సల్మాన్ ఆఫర్ ను ఉత్సాహంతో తాను ఒప్పుకున్నానని.. అయితే.. తన మిత్రుడి సలహాతో నో చెప్పినట్లుగా చెప్పారు.
నువ్వునిజంగానే విదేశాంగ మంత్రిగా పని చేయాలనుకుంటే మాత్రం ఆ పాత్రకు నో చెప్పు అని తన మిత్రుడు ఒకరు సూచించారని.. దీంతో తాను ఆ మూవీలో అవకాశానికి నో చెప్పినట్లుగా చెప్పారు. అమీర్ ఖాన్.. సల్మాన్ ఖాన్లు నటించిన అందాజ్ అప్నా అప్నా చిత్రంలో తాను కనిపించలేదన్న ఆయన.. రాజకీయాల్లోకి వచ్చి పదవులు చేపట్టిన తర్వాతే తనకు సినిమా ఛాన్సులు వచ్చాయన్నారు.
తాను యూత్ లో ఉన్నప్పుడు.. చాలా అందంగా ఉన్నప్పుడు తనకు సినిమా ఛాన్సులు రాలేవన్నారు. ఒకవేళ అదే జరిగి ఉంటే.. ఏ చిన్న స్టార్ గానో నిలిచిపోయేవారే కానీ.. పవర్ చేతిలో ఉండేది కాదు. సల్మాన్ ఇచ్చిన ఛాన్స్ వద్దన్న మాటను చెప్పే క్రమంలో తన మనసులోని విదేశాంగ మంత్రిని చేపట్టాలన్న విషయాన్ని శశిథరూర్ ఎంత తెలివిగా బయటపెట్టారో కదూ?