దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఇప్పటికే మొదలైపోయింది. కరోనా కేసులు రోజురోజుకు జెట్ స్పీడులా పెరిగిపోతున్నాయి. దేశంలో నిత్యం లక్షన్నరకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు గత 24 గంటల్లో దేశంలో 1,79,723 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.29 శాతంగా ఉంది. ముందు ముందు రోజువారీ కేసుల సంఖ్య మరింత భారీగా పెరిగే అవకాశముందని వైద్య నిపుణులు అంచనావేస్తున్నారు.
ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్లు ఈ మేరకు దేశంలో థర్డ్ వేవ్ ముగింపుపై పరిశోధించారు. థర్డ్ వేవ్ పై తన అంచనాలను వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్య, వైరస్ ఎన్ని రెట్లు వేగంగా వ్యాపిస్తోంది? తదితర అంశాలపై విశ్లేషించారు.
ఈ క్రమంలోనే జనవరి నెల మధ్యలో ఢిల్లీ -ముంబైలో థర్డ్ వేవ్ పీక్స్ కు చేరే అవకాశముందని అంచనావేశారు. మూడో వారం నుంచి అక్కడ రోజువారీ కేసుల సంఖ్య దిగివచ్చే అవకాశముందని తెలిపారు.
దేశంలో థర్డ్ వేవ్ కర్వ్ వచ్చే నెల ఫిబ్రవరి ప్రారంభంలో పీక్స్ కు చేరవచ్చని ప్రాథమిక అంచనా వేశారు. థర్డ్ వేవ్ సమయంలో దేశంలో మొత్తం రోజువారీ కేసుల సంఖ్య 4 నుంచి 8 లక్షల వరకూ నమోదు కావచ్చని తెలిపారు.
ఫిబ్రవరి మొదటివారం తర్వాత కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశముందని ఐఐటీ ప్రొఫెసర్లు తెలిపారు. మార్చినెల నాటికల్లా దేశంలో థర్డ్ వేవ్ దాదాపుగా ముగిసే అవకాశమున్నట్లు అంచనావేశారు.