రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది ఫిబ్రవరి 26 నుంచి భీకర పోరు జరుపుతోంది. కానీ రష్యా ఏం సాధించింది? ఉక్రెయిన్ ను ఎంత భయపెట్టినా అది ఏ మాత్రం తగ్గేదేలే అంటోంది. దీంతో పుతిన్ సహనం నశించి నిరాశా నిస్ర్పహలకు లోనవుతున్నట్లు తెలుస్తోంది కానీ యుద్ధం మాత్రం ఆపేది లేదని పుతిన్ సైతం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ప్రపంచం మొత్తం భయానక పరిస్థితుల్లో బతుకుతోంది. ఏం జరగబోతోందనే విషయంలో నిరంతరం ప్రజలు ఆందోళన చెందుతున్నారు
ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి చీఫ్ ఉక్రెయిన్, రష్యాల మధ్య సామరస్య చర్చలు కొనసాగించేందుకు నిర్ణయించుకున్నా ఆయన భేటీ ప్రభావం చూపుతుందా? రెండు దేశాలు శాంతి చర్చలకు అంగీకరిస్తాయా? అన్నదే పాయింట్. దీంతో రాబోయే కాలంలో కూడా రష్యా ఇలాంటి దుర్ఘటనలక పాల్పడితే ప్రపంచ మానవాళి సమ్మతిస్తుందా? నాగరికత పెరుగుతున్న కాలంలో కూడా యుద్ధాలు ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. పుతిన్ సేనలపై విమర్శల జడివాన కురుస్తోంది.
రష్యా సేనల పోరులో అమాయక ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మొదట జనావాసాలపై యద్ధం చేయమని చెప్పిన పుతిన్ సేనలు తరువాత మనసు మార్చుకుని ప్రజలపై కూడా దాడులకు తెగబడుతున్నారు. ఫలితంగానే లక్షలాది మంది జనాలు అసువులు బాస్తున్నారు. రక్తపుటేరులు పారుతున్నాయి. వీటన్నింటికి పుతిన్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబడాల్సి ఉంటుంది. దీనికి గాను అమెరికా ఇప్పటికే హెచ్చరికలు చేసినా బేఖాతరు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మాస్కో అధునాతన యంత్రాలతో దూసుకుపోతోంది. ఉక్రెయిన్ ను ఉక్కిరిబిక్కిరి చేయాలని చూస్తోంది. ఇందుకు గాను యుద్ధ తంత్రాన్ని మారుస్తోంది. ఉక్రెయిన్ ను కబలించి తీరుతామని పుతిన్ చెబుతున్నారు. జెలెన్ స్కీ మాత్రం తగ్గడం లేదు. రష్యాను అడ్డుకుని తీరుతామని ధీమాగా ప్రకటిస్తున్నారు. దీంతో రష్యా సేనలు మరింత రెచ్చిపోతున్నాయి. ఉక్రెయిన్ ను హస్తగతం చేసుకునే క్రమంలో ఎంతకైనా తెగించేందుకు సిద్ధమవుతున్నాయి.
ఒక పక్క బాంబుల మోత మోగుతున్నా మరోపక్క ఉక్రెయిన్ అధ్యక్షుగు జెలెన్ స్కీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. రష్యా సేనలు మనల్ని ఏం చేయలేవని చెబుతున్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు. అవసరమైతే ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోమని చెప్పడం విశేషం. దీంతో రష్యా కూడా తన యుద్ధాన్ని పెంచుతోంది. క్షిపణి దాడులు పెంచుతోంది. నిర్దేశిత లక్ష్యాలను గురిపెట్టి నాశనం చేయాలని చూస్తోంది.