రాజకీయాలలో ఎవరు ఎప్పుడు కింగ్ అవుతారో ..ఎప్పుడు కనిపించకుండా పోతారో ఎవరికీ తెలియదు. ప్రజల ఆదరణతో పాటుగా కాలం కలిసొచ్చినన్ని రోజులు ఒక వెలుగు వెలిగిన నేతలు కూడా ఒకసారి అధికారానికి దూరమైతే మళ్ళీ ఎన్నికల వరకు కనిపించరు. ఎన్నికలలో ఓడిపోతే వచ్చే ఎన్నికల కోసం సిద్దమై ..పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోవాలి కానీ , ఎన్నికలలో ఓడిపోయాం కదా అని ప్రజల మధ్యకి రాకుండా పొతే ..ఇక ఎప్పటికి తేరుకోలేరు. గత కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని నేతలని చూస్తే ఇదే అనిపిస్తుంది. ఒకప్పుడు అధికారం తో ఒక వెలుగు వెలిగిన నేతలు కూడా ఇప్పుడు కనీసం పార్టీ ఆఫీస్ వైపు కూడా తొంగి చూడటంలేదు.
ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఈ ప్రాంతానికి చెందిన నేతలు రాష్ట్ర స్దాయిలో ఓ వెలుగు వెలిగి జాతీయ స్ధాయిలో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో మాజీ పీసీసీ ఛీఫ్ డి. శ్రీనివాస్, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీలు ఉండగా గత ఎన్నికల్లో మాజీ పీసీసీ ఛీఫ్ డి.ఎస్., మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కారెక్కేశారు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, మధుయాష్కీలు సీనియర్లుగా పార్టీకి పెద్దదిక్కు అయ్యారు. కానీ , పార్టీ వ్యవహారాల్లో మాత్రం పెద్ద దిక్కుగా మారడంలేదు.
ప్రత్యక్ష ఉద్యమాల్లో పాల్గొనక తమ నేతలు అసలెక్కడున్నారో తెలియక కార్యకర్తలు అయోమయం లో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని ఊపేస్తున్న తెలంగాణ ఆర్టీసీ సమ్మెని అందరూ క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ , ఈ ముగ్గురు నేతలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి జిల్లాలో అత్యంత సీనియర్ ఆయన ఎన్నికలొస్తేనే కనిపిస్తారనే టాక్ ఉంది. మాజీ ఎంపీ మధుయాష్కీ గడిచిన ఎన్నికలలో ఓడిపోవడం తో ఆ తరువాత అయన మళ్ళీ జిల్లాలోనే కనిపించడంలేదు. మరో ముఖ్య నేత షబ్బీర్ అలీ హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నా కామారెడ్డికి అడపాదడపా వస్తూ మీడియా సమావేశాలకే పరిమితం అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆర్టీసీ సమ్మెను తమకు అనుకూలంగా మార్చుకుంటూ మిగతా పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తుంటే, అంతోకొంత కార్యకర్తల బలం ఉన్న కాంగ్రెస్ నేతలు మాత్రం, అంతగా పట్టించుకోకుండా అంటీముట్టనట్లు వ్యవహారిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోందని కార్యకర్తలు చర్చలుజరుపుతున్నారు. మరికొద్దిరోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. దీనితో పోటీ చేయాలనీ భావించే వారిలో అయోమయం నెలకొంది. మొత్తంగా మరి కొన్ని రోజులపాటు ఇలానే కొనసాగితే ఒకప్పుడు జిల్లా రాజకీయాలలో కీలకంగా వ్యవహరించిన ఈ ముగ్గురు నేతలని సొంత పార్టీ కార్యకర్తలే మరచిపోయే ప్రమాదం ఉంది.