పంచాయితి ఎన్నికల నిర్వహణ వివాదంలో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేయించాలని ప్రభుత్వం అనుకున్నది. అందుకనే ప్రభుత్వం సుప్రింకోర్టులో కేసు వేసింది. ప్రభుత్వంతో పాటు ఇదే పాయింట్ పై ఉద్యోగ సంఘాల నేతలు కూడా పిటీషన్లు వేశారు. అయితే ప్రభుత్వం, ఉద్యోగసంఘాల నేతల వాదనలను సుప్రింకోర్టు ధర్మాసనం వినిపించుకోలేదు. ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా దాఖలైన అన్నీ పిటీషన్లను కోర్టు కొట్టేసింది.
సరే ఇక ముందు ఏమి జరుగుతుంది అన్నది అప్రస్తుతం. అయితే హోలు మొత్తం మీద ప్రభుత్వం ఎక్కడ ఫెయిలైంది అన్నదే ఇక్కడ పాయింట్. కోర్టును ఆశ్రయించేముందు తన వాదనలో పస ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోవు అన్నది అందరు అనుకుంటున్నమాటే. అయితే ప్రస్తుత కరోనా వైరస్ ప్రత్యేక పరిస్ధితుల్లో కోర్టులు జోక్యం చేసుకుంటాయని ప్రభుత్వం అనుకున్నది.
ఇదే ఉద్దేశ్యంతో హైకోర్టులో కేసు వేసింది. సింగిల్ బెంచ్ ప్రభుత్వ వాదనకు సానుకూలంగా స్పందించింది. అయితే డివిజన్ బెంచ్ వ్యతిరేకంగా తీర్పిచ్చింది. దాంతో కేసు సుప్రింకోర్టుకు చేరింది. ఇక్కడ కూడా ప్రభుత్వానికి తీర్పు వ్యతిరేకంగా వచ్చింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే హైకోర్టులో ఏ వాదనలను అయితే ప్రభుత్వం వినిపించిందో అదే వాదనను సుప్రింకోర్టులో కూడా వినిపించింది. హైకోర్టులో చెల్లుబాటు కానీ వాదన సుప్రింకోర్టులో చెల్లుబాటవుతుందని ప్రభుత్వం ఎలా అనుకున్నదో అర్ధం కావటంలేదు. సుప్రింకోర్టులో వాదనకు కొత్త పాయింట్లను ప్రభుత్వం హైలైట్ చేసుంటే బాగుండేది.
అసలు సుప్రింకోర్టులో ప్రభుత్వం కేసు వేయకుండా ఉద్యోగసంఘాలతో కేసులు వేయిస్తే సరిపోయేది. ఒకవేళ సుప్రింకోర్టులో ఉద్యోగసంఘాల కేసును కోర్టు కొట్టేసినా ప్రభుత్వానికి కాస్త పరువైనా దక్కుండేది. ఇప్పుడేమైంది ప్రభుత్వం+ఉద్యోగసంఘాలేసిన కేసులను కోర్టు ఒకే దెబ్బకు కొట్టేసింది. ఇప్పటికైనా సుప్రింకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పంచాయితి ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే హుందాగా ఉంటుంది.