పుట్టినరోజు నాడు కేసీఆర్​ ఎక్కడున్నారు?

Update: 2021-02-18 13:30 GMT
సీఎం కేసీఆర్​ పుట్టినరోజు సందర్బంగా నిన్న ( గురువారం) రాష్ట్రవ్యాప్తంగా హడావుడి నెలకొన్నది. ఓ పక్కన కోటి మొక్కల ఉత్సవం.. మరోవైపు ఎక్కడికక్కడ టీఆర్​ఎస్​ నేతలు సంబురాలు జరుపుకున్నారు. అన్నదానాలు.. పూజలు, యాగాలతో నిన్న తెలంగాణ వ్యాప్తంగా వేడుకలు మిన్నంటాయి. గతంలో ఎన్నడూ లేనంత ఘనంగా వేడుకలు జరిపారు. హైదరాబాద్​లోని జలవిహార్​లో మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ 67 కిలోల కేక్​ కట్ చేశారు. ఇక జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్​ సీఎం కేసీఆర్​ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. యూసుఫ్​గూడలోని కోట్ల విజయభాస్కర్​రెడ్డి స్టేడియంలో శ్రీవారి కల్యాణం నిర్వహించారు. ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. ఇక్కడ దాదాపు 10 వేల మందికి భోజనాలు పెట్టినట్టు సమాచారం.

ఇదిలా ఉంటే పుట్టినరోజు నాడు సీఎం కేసీఆర్​ ఎక్కడున్నారు? అని సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. నిన్న సీఎం కేసీఆర్​ పెద్దగా మీడియాలో కనిపించలేదు. ప్రగతిభవన్​లో కూడా సీఎం కేసీఆర్​ ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. ఆయన తనయుడు మంత్రి కేటీఆర్​ మాత్రం మొక్కలు నాటారు? ఇదిలా ఉంటే కేసీఆర్​ ఎక్కడున్నారు? అని ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి నెలకొన్నది.
అయితే సీఎం కేసీఆర్​ తన పుట్టినరోజు వేడుకలను ఫామ్​ హౌస్​లో జరుపుకున్నారు. అక్కడికి మంత్రులు, ఎమ్మెల్యేలను అనుమతించలేదు. చాలా మంది సీఎం కేసీఆర్​ను కలుసుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలపాలని భావించారు. కేసీఆర్​ మాత్రం ఫామ్​హౌస్​లోనే గడిపారు.


కొడుకు కేటీఆర్​ కోడలు శైలిమ, కూతురు కవిత, అల్లుడు, మనమలు, మనమరాళ్లు మాత్రమే సీఎం కేసీఆర్​ను కలుసుకున్నవారిలో ఉన్నారు. కేసీఆర్​ పుట్టినరోజు సందర్భంగా ఫాంహౌస్ లో రుద్రాక్ష మొక్కను నాటారు. అయనను కలిశే అవకావ: మాత్రం కొద్దిమందికి.. అది కూడా కుటుంసభ్యులకు మాత్రమే దక్కింది.



Tags:    

Similar News