అయినవారి కోసం టీటీడీ నిభందనలను ఉల్లంఘిస్తోందని నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. "ఈవో కుటుంబమా.. మజాకా.. టీడీపీ నిబంధనలు మనోళ్లకే బ్రో.." అని వ్యాఖ్యానిస్తున్నారు. బయోమెట్రిక్ విధానాన్ని తమ బంధువులు కోసం టీటీడీ ఈవో, ఇతర పెద్దలు ఇష్టానుసారం వాడేస్తున్నారని కూడా ఆధారాలతో సహా చెబుతున్నారు. తాజాగా శుక్రవారం జరిగిన శ్రీవారి అభిషేక సమయంలో బయోమెట్రిక్ గేటు నుంచి ఈవో జవహర్ రెడ్డి బంధువులు ఆలయ ప్రవేశం చేశారు.
సాధరణంగా అభిషేక సేవ సర్కార్‍గా ఈఓ కాని చైర్మన్ కాని హజరయ్యే వెసులుబాటు ఉంది. కానీ, శుక్రవారం నాటి అభిషేక సేవకు ఇద్దరు హజరుకావడంతో.. ఒకటవ నెంబర్ టిక్కెట్ కలిగిన భక్తుడికి ఇబ్బంది ఏర్పడింది.
దీంతో ఆయన తనకు కలిగిన ఇబ్బందిని సోషల్ మీడియాతో వీడియోతో సహా పంచుకున్నారు. దీంతో టీటీడీ పోకడలు, నిర్ణయాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉంటున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయిన వారి కోసం నిబంధనలు అన్నీ పక్కన పెడుతున్న టీటీడీ పెద్దలు అని వ్యాఖ్యానిస్తున్నారు.
సామాన్య భక్తులను టోకెన్ లేకపోతే కనీసం కొండమీదకు కూడా పంపడం లేదని.. ఉద్యోగుల ప్రవేశ మార్గమైన బయోమెట్రిక్ ఎంట్రన్స్ ద్వారా ఈ రోజు వెళ్లింది ఎవరు. అభిషేక సేవలో ఈవో, చైర్మన్ స్థానంలో పాల్గొన్నది ఎవరు..?.. ఈవో గారు ఆ అతిథిలు ఎవరో చెప్పి ఈ వీడియోకు సమాధానం ఇవ్వగలరా? అని నెటిజన్లు నిలదీస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో భారీ ఎత్తున వైరల్ అవుతోంది.
ఈవో ఏమన్నారంటే..తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె ఎస్ జవహర్ రెడ్డి దీనిపై స్పందించారు. శుక్రవారం నాడు తిరుమల శ్రీవారికి జరిగిన అభిషేక సేవలో కొందరు హాజరయ్యింది వాస్తవమేనని అన్నారు. అయితే వారు అభిషేక సేవ టికెట్టు కొనుక్కొని మరీ వెళ్లడం జరిగిందన్నారు. అయితే.. దీనిని కొందరు వక్రీకరించి, దుష్ప్రచారంలో భాగంగా వాడుకోవడం దురదృష్టకరమని యధాలాపంగా విమర్శించారు.
అదేవిధంగా తిరుమల ఆలయం ముందున్న బయోమెట్రిక్ ప్రవేశ ద్వారం నుంచి ఒక ఉన్నతాధికారికి సంబంధించిన వ్యక్తి ప్రవేశించినట్లు చేస్తున్న దుష్ప్రచారం కూడా అవాస్తవమేనన్నారు. బయోమెట్రిక్ ప్రవేశ ద్వారము నుండి నిత్యం వయో వృద్ధులు, వికలాంగులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మార్గం ద్వారా రావడానికి శరీరం సహకరించని వారిని బయోమెట్రిక్ ప్రవేశం ద్వారా అనుమతించడం జరుగుతుందన్నారు. ఈ కేటగిరిలో టీటీడీ కార్యనిర్వాహణాధికారికి సంబంధించిన బంధువులకు కూడా అర్హత ఉండటం కారణంగా అనుమతించినట్టు చెప్పారు.