హుజూరాబాద్ ‘ఉప’పోరులో జోకర్ గా మారిందెవరు..?

Update: 2021-11-04 08:47 GMT
తెలంగాణలో ఇటీవల జరిగిన ఉప ఎన్నిక రసవత్తరంగా సాగింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను భర్త్ రఫ్ చేసిన నేపథ్యంలో తన బలమేంటో చూపించేందుకే ఈ ఎన్నిక జరిగిందని చర్చించుకుంటున్నారు. అయితే ఈటల రాజేందర్ అనుకున్నది సాధించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి విజయం సాధించాడు. కానీ ఈటల రాజేందర్ మోహం అసెంబ్లీలో చూడొద్దని శపథం చేసిన  టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నియోజకవర్గంలో గెలిచేందుకు మాత్రం తీవ్రంగా శ్రమించారు. తమ పార్టీ తరుపున గెల్లు శ్రీనివాస్  అభ్యర్థిని నిలబెట్టినా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు నియోజకవర్గంలో జోరగా పర్యటించారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేశారు. అయితే ప్రజలను ఆకట్టుకోవడమే కాకుండా  ఈటల రాజేందర్ ను రాజకీయంగా దెబ్బ తీయాలని కేసీఆర్ అనేక వ్యూహాలను రచించారు. ఇందుకోసం హుజూరాబాద్ లోని ముఖ్య నాయకులను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు.

ఇప్పటి వరకు బీజేపీలో కొనసాగిన పెద్దిరెడ్డి, అంతకుముందు టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగిన ముద్దసాని దామోదర్ రెడ్డి కుమారుడు కశ్యప్ రెడ్డిలను చేర్చుకున్నారు. ఇక గత ఎన్నికల్లోకాంగ్రెస్ తరుపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన కౌశిక్ రెడ్డి సైతం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.కాంగ్రెస్ లో ముఖ్యనేతగా కొనసాగిన కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ లో జరిగే ఉప ఎన్నికలో పార్టీ తరుపున తనకే టికెట్ వస్తుందని భావంచారు. కానీ రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తరువాత ఆయనకు సన్నిహితంగా మెలిగినా టికెట్ రాదని తేలడంతో కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఆయనపై తీవ్ర విమర్శలు చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు.

ఈటలపై పోటీ చేసేందుకు  టీఆర్ఎస్ తరుపున తనకే టికెట్ వస్తుందని కౌశిక్ రెడ్డి ఆశలు పెంచుకున్నారు. అందులో భాగంగానే ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి వరకు కాంగ్రెస్ నేతగా కొనసాగిన కౌశిక్ టీఆర్ఎస్ లో చేరిన తరువాత టికెట్ ఇవ్వకపోగా ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని బుజ్జగించారు. దానికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ ఫైలును గవర్నర్ కు పంపారు. అయితే గవర్నర్ ఆ ఫైలు పై సంతకం చేయడంలో ఆలస్యం జరుగుతోంది. అయినా సరే పార్టీ ప్రకటించిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఇంటింటికి తిరిగారు.

అయితే హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గెలుపుతో కౌశిక్ రెడ్డి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.  తాను ఎన్నో ఆశలతో టీఆర్ఎస్ లో చేరితే టికెట్ రాకపోగా.. ఎమ్మెల్సీ పదవి కూడా ఎటూ కాకుండా మారడంతో ఆయన ఆనుచరులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. దీంతో తన ఫ్యూచన్ ప్లాన్ పై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు పార్టీలో తనకు ఎమ్మెల్సీ పదవి వచ్చేలా తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా టీఆర్ఎస్ తరుపున బరిలో ఉండి ఓడిపోయిన గెల్లు శ్రీనివాస్ ను బలి పశువు చేవారని యాదవ సంఘం ఆరోపిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో తమ అభ్యర్థి ఓటమితో టీఆర్ఎస్ నాయకులు తలలు పట్టుకున్నారు. నియోజకవర్గంలో ఉన్న కాస్త బలం కూడా లేకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే విధంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తే కౌశిక్ రెడ్డికి ఇక చేయి ఇచ్చినట్లేనని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. దీంతో మొత్తం హుజూరాబాద్ ఉప ఎన్నికలో కౌశిక్ రెడ్డిని జోకర్ గా మార్చాని కొందరు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News