కరోనా మహమ్మారిపై డబ్ల్యూహెచ్వో ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ప్రపంచ దేశాలను అలర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. కరోనా కేసులు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ప్రజలంతా ఇక కరోనా పోయినట్టేనని మురిసిపోతున్నారు. నిబంధనలు గాలికికొదిలేసి.. మాస్కులు తీసి పారేసి.. భౌతికదూరం అనే సంగతే మరిచిపోయి ఇష్టారాజ్యంగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.
మనదేశంలో కూడా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్రలో రోజువారి కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా డబ్ల్యూహెచ్వో కరోనాపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఏడాది చివరి నాటికి కరోనా వైరస్ పూర్తిగా మనల్ని వదలి పోదని తేల్చిచెప్పింది. అయితే ఇటీవల అందుబాటులోకి వచ్చిన టీకాలతో మరణాల సంఖ్య తగ్గొచ్చని చెప్పింది.
కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు కృషిచేయాలని డబ్యూహెచ్ వో అన్ని దేశాలకు సూచించింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ చీఫ్ డాక్టర్ మైకేల్ ర్యాన్ సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.అయితే మనమంతా అప్రమత్తంగా ఉండే కరోనా వ్యాప్తిని తగ్గించుకోవచ్చని డబ్ల్యూహెచ్వో పేర్కొన్నది.
ఈ ఏడాది చివరినాటి కరోనా వైరస్ పూర్తిగా పోదు.. అయితే మరణాలు, ఆస్పత్రి పాలయ్యేవారి సంఖ్య తగ్గొచ్చు అని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రతినిధులు తేల్చిచెప్పారు. అయితే చాలా దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమయినప్పటికీ.. ఇంకా పేదదేశాలకు వ్యాక్సిన్ అందకపోవడం విచారకరమని డబ్ల్యూహెచ్వో ప్రతినిధులు పేర్కొన్నారు. పేద దేశాలకు వ్యాక్సిన్ ఇవ్వని ధనిక దేశాల తీరును డబ్ల్యూహెచ్వో తప్పుపట్టింది.