ఎవరీ అనీషా.. ఏవరు ఈమె.?

Update: 2019-02-22 10:10 GMT
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే కేసీఆర్ 105 మంది అభ్యర్థుల్ని ప్రకటించి సంచలనం సృష్టించారు.   ఆ ఎత్తుగడ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అసమ్మతి సద్దుమణిగి టీఆర్ ఎస్ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు కేసీఆర్ ఫార్ములానే బాబు అనుసరిస్తున్నాడట.. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే అభ్యర్థుల్ని ప్రకటించడానికి సిద్ధమయ్యారు. ఆఖరి నిమిషం వరకూ లెక్కలేసి .. సమీకరణాలతో కాలం వృథా చేసి.. అసమ్మతి చెలరేగుతుందని జాప్యం చేసి తెలంగాణలో కాంగ్రెస్ ఓడిన సంగతి తెలిసిందే..

తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు పక్కా ప్రణాళికతో అభ్యర్థుల్ని ఫైనల్ చేస్తున్నారు. చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులోని పుంగనూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా అనీశా రెడ్డిని ప్రకటించడం ఆసక్తిగా మారింది. ఇంతకీ ఎవరు ఈమె.? ఎక్కడి వారు.? ఏం చేస్తుంటారు..? బాబు ఎందుకు ఈ సీటిచ్చారన్నది హాట్ టాపిక్ గా మారింది.

పుంగనూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా రెండు సార్లు పోటీచేసి వెంకటరమణ ఓడిపోయారు. అందుకే ఈసారి ఆయన స్థానంలో కొత్త అభ్యర్థిగా అనీశా రెడ్డిని ప్రకటించారు.  మాజీ ఎంపీ రామకృష్ణా రెడ్డి కుమారుడు పుంగనూరు టీడీపీ సమన్వయ కర్త శ్రీనాథరెడ్డి సతీమణే అనీశా రెడ్డి. ఆమె తండ్రికి కూడా రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఉంది. మొదటి నుంచి రాజకీయాలపై ఆసక్తితో ఉన్న ఈమె మూడు సార్లు టీడీపీ టికెట్ ఆశించారు. దరఖాస్తు కూడా చేసుకున్నారు.  పుంగనూరులో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల మద్దతు పొందారు. ఈమె చేసిన సేవలు చంద్రబాబు దృష్టిలో పడ్డాయి. అదే బాబు టికెట్ ఇవ్వడానికి కారణమైంది. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ దాడులు, గొడవలు జరిగినప్పుడు వారికి అండగా అనీశా రెడ్డి నిలబడ్డారు. ఆ మధ్య వైసీపీ నేతలు స్టేజీ ఎక్కనివ్వకపోతే ప్రజల మధ్యలో కూర్చొని ప్రసంగించి నిరసన తెలిపారీమే.. దాడులు జరిగినప్పుడు వారికి ఓదార్పునిచ్చారు. అందుకే ఈసారి కార్యకర్తల కోరిక మేరకు అనీశారెడ్డికి టికెట్ ఇచ్చాడట బాబు. ఇలా అభ్యర్థుల ఎంపికలో బాబు ఈసారి ప్రజాబలం ఉన్న వారినే పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తుండడం విశేషంగా చెప్పవచ్చు.
Tags:    

Similar News