‘ఇంట్లో ఇద్దరిని కాల్చాడు.. వాచ్ మెన్ శవం ఉన్నా వెళ్లాడు..’ బాలయ్యపై పోసాని కామెంట్స్‘
నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి మళ్లీ మాటల మంటలు రేపారు. ఈసారి ఆయన హీరో బాలకృష్ణపై చేసిన కామెంట్స్ పెనుదుమారం రేపాయి. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్ మెంట్ చైర్మన్ గా ఉన్న పోసాని తాజాగా ముఖ్యమంత్రి జగన్ ను తిట్టిన బాలయ్యపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.. ఓ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన పోసాని ఈ మేరకు బాలయ్యపై పరుష వ్యాఖ్యలు చేశారు.
-ఇంతకీ బాలయ్య ఏమన్నాడు..
ముఖ్యమంత్రి జగన్ సైకో అంటూ బాలకృష్ణ ఇటీవల వ్యాఖ్యానించారు. నియంతలా పాలిస్తున్నారని.. ఆయన పాలనకు త్వరలోనే ముగింపు పడబోతోందంటూ రాజకీయ విమర్శలు చేశారు. ‘సైకో పోవాలి’ అంటూ టీడీపీ నేతల వలే నినదించారు. ఎప్పుడూ జగన్ పై నేరుగా విమర్శలు చేయని బాలయ్య అన్న ఈ మాటలపై వైసీపీ నేతలకు మంటపుట్టించాయి. ఈ క్రమంలోనే పోసాని చాలా ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు.
-బాలయ్య పై పోసాని తీవ్ర వ్యాఖ్యలు
పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ ‘బాలకృష్ణ గారు ఇద్దరినీ తుపాకీతో టపీ టపీమని కాల్చేశాడు. ఎవరైనా మంచి వాళ్లు కాలుస్తారా? సైకోలు కాలుస్తారా? మనకు చట్టం, న్యాయం అన్నీ ఉన్నాయి. ఆయనకేమైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లాలి. కేసులు పెట్టొచ్చు. గన్ ఉంది కదాని ఇద్దర్నీ కాల్చాడు. కాల్చిన తర్వాత ఒకరోజైనా జైలులో ఉన్నాడా. ? నేను ఇద్దరినీ కాల్చాననుకోండి.. పోసాని అమాయకుడిని అని వదిలేస్తారా? కొట్టి బొక్కలో పెట్టి రిమాండ్ పంపించి జైలులో పెడుతారు. నువ్వు ఒకరిని కాల్చావు. ఒకరోజు కూడా జైలుకెళ్లలేదు. ఎవరు అసమర్థుడు.. ఎవరు క్రూరుడు. ఎవరు మానసికంగా బాధపడుతున్నారో చెప్పాలి’ అంటూ బాలయ్యపై పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
-వాచ్ మన్ శవం ఉన్నా వెళ్లిపోయాడు
ఇక అంతటితో ఆగకుండా పోసాని మరో ఇష్యూను లేవనెత్తారు. ‘మీ ఇంట్లో మీ కళ్లముందే నైట్ వాచ్ మెన్ చచ్చిపోయాడు. శవం అక్కడే ఉంది. కానీ బాలకృష్ణ ఏం చేశారు? మేకప్ వేసుకొని డెడ్ బాడీని దాటుకొని షూటింగ్ కు వెళ్లిపోయాడు. ఎవరైనా ఎప్పుడైనా ఈ విషయం అడిగారా? మరి మా జగన్ మోహన్ రెడ్డి గారు సైకోనా? బాలకృష్ణ సైకోనా? ఆయన్నే ప్రశ్నించుకోమనండి.. ఓసారి స్టేజ్ పై ఆడాళ్లకు కడుపు చేయాలని మాట్లాడాడు. ఇలాంటి నీచమైన మాటలను మీరు ఎప్పుడైనా జగన్ గారి నోటీ ద్వారా విన్నారా? ఇలాంటి ఘటనలు లెక్కలేనన్నీ ఉన్నాయి. పబ్లిక్ లో జనాలను కొట్టడంతో సహా ఎప్పుడైనా జగన్ ఎవరినైనా కొట్టాడా? అరేయ్ అనే మాట అనడం ముఖ్యమంత్రి నోటి నుంచి విన్నారా? ’ అంటూ పోసాని మండిపడ్డారు.
ఇక రానున్న ఎన్నికల్లో తమ వైసీపీ ఒంటరిగానే పోటీచేస్తుందని.. ప్రజలు తమను గెలిపిస్తారనే నమ్మకం ఉందని పోసాని అన్నారు. పోసాని వెంట అలీ, జోగినాయుడు కూడా ఉన్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.