అత్యంత బరువున్న క్రికెటర్ అతడే.. సరికొత్త రికార్డు!

Update: 2019-08-31 08:00 GMT
వెస్టిండీస్ తో టీమిండియా ఆడుతున్న రెండో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లోకి  ఆరంగేట్రం చేసిన రకీమ్ కార్న్ వాల్ కొత్తరికార్డును స్థాపించాడు. ప్రపంచ క్రికెట్లో అత్యంత బరువు ఉన్న ఆటగాడిగా అతడు రికార్డు పుటల్లోకి ఎక్కాడు. చాలా మంది ఆటగాళ్లు ఆరంగేట్రం సమయంలో తమ వయసుతో రికార్డులు స్థాపిస్తూ ఉంటారు. చిన్న వయసులో ఆరంగేట్రం చేసిన వారు, లేటు వయసులో ఆరంగేట్రం చేసిన వారుంటారు.

అయితే అత్యధిక బరువు కలిగిన ఆటగాడిగా కార్న్ వాల్ ఆరంగేట్రం చేయడం ఆసక్తిదాయకంగా ఉంది. ఈ ఆటగాడి బరువు నూటా నలభై కిలోలు అని తెలుస్తోంది. ప్రపంచ క్రికెట్లో ఈ స్థాయి బరువుతో ఎంట్రీ ఇచ్చిన వారు ఇంకొకరు లేరు. ఎప్పుడో దశాబ్దాల క్రితం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆర్మ్ స్ట్రాంగ్ 133 నుంచి 139 కిలోల బరువుతో రికార్డును స్థాపించగా.. కార్న్ వాల్ ఆ స్థాయిని దాటేశాడు.

నూటా నలభై కిలోల బరువుతో అతడు కొత్త రికార్డును స్థాపించాడు. క్రికెట్లో సాధారణంగా ఫిట్ నెస్ చాలా ముఖ్యం. మరి ఈ బరువుతో కూడా ఇతడు ఫిట్ గా అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వడంగమనార్హం. ఆరు పాయింట్ ఆరు అడుగుల ఎత్తుతో నూటా నలభై కిలోల బరువుతో ఇతడు ఎంట్రీ ఇచ్చాడు. ఇతడు ఆల్ రౌండర్. ఆఫ్ స్పిన్ బౌలింగ్ వేయడంతో పాటు అదరగొట్టేలా సిక్సులు కొట్టడంలో కూడా ఇతడిది అందెవేసిన చేయి అని తెలుస్తోంది.


Tags:    

Similar News