కుటుంబ స‌భ్యులు అంటున్నావు..నువ్వు చేసిందేంటి ప‌వ‌న్‌

Update: 2018-07-26 18:14 GMT
ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైెఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి - జనసేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్‌ ల మ‌ధ్య‌ మాటల యుద్ధం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఓ ప్రెస్‌ మీట్‌ లో  వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ ``కార్లను మార్చినంత తేలిగ్గా పవన్‌ కల్యాణ్ పెళ్లాలను మారుస్తాడు. ఇప్పటికే నలుగురిని మార్చాడు. ఇలాంటి వ్యక్తి మాటలకు కూడా మనం సమాధానం చెప్పాలంటే విలువలు ఎక్కడున్నాయి? అంటూ పవన్‌ ను జగన్ విమర్శించిన విషయం తెలిసిందే. దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌గ‌న్‌పై త‌మ ఆగ్ర‌హాన్ని ప‌వ‌న్ ఫ్యాన్స్‌ వెళ్ళ‌గ‌క్కారు. ఈ ప‌రిణామం ఏ మ‌లుపు తిరుగుతుందో అని రాజ‌కీయ‌వ‌ర్గాలు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న క్ర‌మంలో ప‌వ‌న్ ఎంట్రీ ఇచ్చారు. త‌న‌ అభిమానుల‌కి ప‌వ‌న్ త‌న విన్న‌పాన్ని ట్వీట్ ద్వారా తెలియ‌జేశారు. ``జ‌గ‌న్ విమ‌ర్శించిన తీరు చాలా మందికి బాధ క‌లిగించిన‌ట్టు నా దృష్టికి వ‌చ్చింది. నేను ఎవ‌రి వ్య‌క్తిగ‌త జీవితాల‌లోకి వెళ్ల‌ను. అది రాజ‌కీయ ల‌బ్ధి కోసం వాడ‌ను. ప్ర‌జ‌ల‌కి సంబంధించిన పాల‌సీల మీద‌నే పార్టీల‌తోనే నేను విభేదిస్తాను. వ్య‌క్తిగ‌తంగా నాకు ఎవ‌రితో విభేదాలు లేవు. ఈ త‌రుణంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారిని - వారి కుటుంబ స‌భ్యుల‌ని కాని - వారి ఇంటి ఆడ‌ప‌డుచుల‌ని వివాదంలోకి లాగొద్దని మ‌న‌స్పూర్తిగా వేడుకుంటున్నాను`` అని పవ‌న్ త‌న ట్వీట్‌ లో ఫ్యాన్స్‌ ను కోరారు.

వివాదం తెర‌మీద‌కు వ‌చ్చిన రెండు రోజుల త‌ర్వాత ప‌వ‌న్ ఈ ట్వీట్ చేయ‌డం వింత అయితే మ‌రికొంద‌రు ఈ ఎపిసోడ్‌ లోని ప‌వ‌న్ తీరును త‌ప్పుప‌డుతున్నారు. కుటుంబ స‌భ్యుల‌ను తెర‌మీద‌కు తేవ‌ద్దంటున్న ప‌వ‌న్ గ‌తం మ‌ర్చిపోయాడా అని ప్ర‌శ్నిస్తున్నారు. అస‌లు అలాంటి సంప్ర‌దాయాన్ని మొద‌లుపెట్టిందే జ‌న‌సేనాని అని గుర్తుకుతెస్తున్నారు. కొద్దికాలం క్రితం క్యాస్టింగ్ టచ్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు..ఆయన వ్యాఖ్యల వెనుక తానున్నట్లు దర్శకుడు రాంగోపాల్ పేర్కొన్నట్లు వీడియో టాలీవుడ్ లో పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.  దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పవన్ నేరుగా ఫిలిం ఛాంబర్ వద్దకు వెళ్లి నిరసన తెలియచేశారు. తన తల్లిని తిట్టిన వారిపై...పదే పదే ప్రసారం చేసిన ఛానెళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అప్పటి నుండి పవన్ ట్విట్టర్ లో ట్వీట్స్ పెట్టారు. ఈ జాబితాలోనే ఓ మీడియా సంస్థ అధిప‌తిని ఉద్దేశిస్తూ ఆయ‌న త‌న‌యుడికి స‌ల‌హా ఇచ్చారు.

ఆర్కే దంప‌తులు - ఆయ‌న కుమారుడు ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన ప‌వ‌న్‌..`బాబు నాన్న‌గారికి రాత్రి భోజనంలో అన్నం - కూర‌ - ప‌ప్పుతో పాటుగా కొంచెం సంస్కారం కూడా వ‌డ్డించ‌మ‌ని చెప్ప‌రా. అలాగే సంస్కార‌వంత‌మైన స‌బ్బుతో త‌ల‌స్నానం చేయ‌మ‌ని చెప్పండి.గుడ్ నైట్` అంటూ స‌ల‌హా వంటి సెటైర్ పోస్ట్ చేశారు. త‌ద్వారా మీడియా త‌న‌ను కెలికితే...త‌నూ అదే రీతిలో రియాక్ట్ అవుతానంటూ ప‌వ‌న్ చాటిచెప్పారు. ఇలా రాజ‌కీయ నాయ‌కుడికి - ప‌త్రికాధిప‌తికి మ‌ధ్య సాగిన పోరులో కుటుంబాన్ని ప‌వ‌న్ లాగారు. ఏకంగా కుటుంబ స‌భ్యుల ఫొటోతో పోస్ట్ పెట్టారు. ఆ ఫొటోలో ఆర్కే స‌తిమ‌ణి ఉన్నారు. ఆర్కే భార్య కాబ‌ట్టి స‌ద‌రు స్త్రీ ఉన్న ఫొటో ట్విట్ట‌ర్లో పోస్ట్ చేసి మ‌రీ కామెంట్లు చేసిన‌ ప‌వ‌న్ ఇప్పుడు...ఆడ‌వాళ్ల‌ను వివాదాల్లోకి తేవ‌ద్ద‌ని ఫ్యాన్స్‌కు సూచించ‌డం చిత్రంగా ఉంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప‌వ‌న్ డైలాగ్‌లు బాగానే ఉన్నాయి కానీ ఓ సారి గ‌తం కూడా త‌రిచి చూసుకుంటే మేలు అని సెటైర్లు వేస్తున్నారు.
Tags:    

Similar News